English   

ముసలోడే కానీ.. మహా స్టైలిష్...

rajinikanth-us

చాలామందికి వయసు పెరుగుతుంది. కానీ రజినీకాంత్ కు తగ్గుతుంది. ఎందుకంటే ఆయన రజినీకాంత్ కాబట్టి. యస్.. లేటెస్ట్ గా ఆయన అమెరికాలో దిగిన స్టిల్స్ చూసిన ఎవరికైనా చాలా త్వరగా గడ్డం నెరిసింది అనుకుంటారు కానీ.. సూపర్ స్టార్ కు వయసు మళ్లింది అని ఎవరూ అనుకోరు. ఎంత ఠీవిగా ఉన్నాడు. ఎంత రాజసంగా కనిపిస్తున్నాడీ లుక్ లో. కుర్రాళ్లలాగా(లాగా ఏవిటీ.. కుర్రాడే) డ్రెస్ వేసుకుని ఎస్కలేటర్ పై స్టైల్ గా నించున్న రజినీని చూస్తే నోట మాటలు రావంటే అతిశయోక్తి కాదు. అసలు ఈ వయసులో కూడా ఈ ఫిజిక్ మెయిన్టేన్ చేయడం.. దానికి తగ్గట్టుగా ఏమాత్రం తగ్గని చురుకుదనం చూపడం.. ఎవరికి సాధ్యం చెప్పండి. ఒక్క సూపర్ స్టార్ కు తప్ప. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయన స్టిల్స్ కు వాల్డ్ వైడ్ గా రజినీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇతరులు కూడా ఫిదా అయిపోతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కాలా జూన్ 7న విడుదల కాబోతోంది. దీని తర్వాత యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాత్ తో సినిమా మొదలవుతుంది. ఈ సినిమాను ఈ యేడాది చివరి వరకూ పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతుండటం విశేషం. అలాగే శంకర్ డైరెక్షన్ లో నటించిన 2.0 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఏదేమైనా రజినీ స్టైలిష్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

More Related Stories