సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

తమిళ సినీ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. 51వ దాదా సాహెబ్ పాల్కే అవార్డును ఆయనకు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది హిందీ నటుడు అమితాబ్ బచ్ఛన్కు ఈ అవార్డు వచ్చింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
రజనీకాంత్ కూడా సొంత పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇదివరకు అంతా భావించారు. చివరికి అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని, తన నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారతీయ సినీ రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుమీద ఓ అవార్డుని ప్రకటిస్తోంది. తొలిసారిగా ఈ అవార్డును 1969లో ప్రకటించారు. తెలుగు సినీరంగం నుంచి గతంలో కె.విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు.