English   

 ఆయ‌న‌కు 150 వ‌స్తే.. అంతే ఇంక‌..!

Rajinikanth
2018-05-15 09:42:39

సినిమా వాళ్లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌పుడు అభిమానులు కూడా ఎక్కువ‌గా ఊహించుకుంటారు. ఆయ‌న వ‌చ్చి ఏదో చేస్తాడ‌ని.. లేదంటే వాళ్ళొచ్చి కొత్త‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తార‌ని ఏవేవో ఊహించుకుంటారు. కానీ అంద‌రికీ సాధ్యం కాదు అది. ఓ ఎన్టీఆర్.. ఓ ఎమ్జీఆర్.. ఓ జ‌య‌ల‌లిత‌.. వీళ్ళు కాక రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాలు సృష్టించింది అయితే లేదు. ఇప్పుడు ర‌జినీకాంత్ పై మ‌ళ్లీ అంచ‌నాలున్నాయి. మ‌ధ్య‌లో చిరంజీవి వ‌చ్చినా చేసిందేమీ లేదు. విమ‌ర్శ‌లు మీదేసుకుని మ‌ళ్లీ సినిమాల్లోకి రావ‌డం త‌ప్ప‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా ఇదే జ‌రుగుతుందిప్పుడు. ఈయ‌న పూర్తిస్థాయి రాజ‌కీ యాల్లో ఉన్నా కూడా ఎన్నిక‌ల్లో మొత్తానికి అయితే పోటీ చేయ‌డు.. చేసినా ముఖ్య‌మంత్రి అయ్యేంత సీట్లు అయితే రావు. కానీ ర‌జినీ రాజ‌కీయ ప్ర‌యాణంపై సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. త‌మిళ‌నాట ర‌జినీ పార్టీకి ఏకంగా 150 సీట్లు వ‌స్తాయ‌ని జోస్యం చెబుతుంది ఓ స‌ర్వే. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం పార్టీ గుర్తు ప్ర‌క‌టించలేదు.. సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.. మ‌రోవైపు ఎన్నిక‌లు మ‌రో ఏడాదిలో వ‌చ్చేస్తున్నాయి.. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌ర్వే చేస్తే 150 సీట్లు వ‌స్తాయ‌ని చెప్ప‌డం కాస్త హాస్యాస్ప‌దంగానే ఉంది. కానీ అక్క‌డున్న‌ది ర‌జినీకాంత్.. త‌మిళ ప్రేక్ష‌కులు.. వాళ్ల‌కు న‌చ్చిందే చేస్తుంటారు. అసలే ఇప్పుడు అమ్మ పోయిన బాధ‌లో ఏ పార్టీని న‌మ్మాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నారు వాళ్లు. అలాంటి వాళ్ల‌కు ర‌జినీ కొత్త ఆప్ష‌న్ గా క‌నిపించాడంటే మాత్రం మ‌రో ఆలోచ‌న లేకుండా గుద్దేస్తారు ఓట్లు. మ‌రి చూడాలిక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ర‌జినీ రాజ‌కీయ సంచ‌ల‌నాలు ఎలా ఉండ‌బోతున్నాయో..? 

More Related Stories