English   

ఇది విన్నారా.. న‌వంబ‌ర్ 29న 2.0..!

Rajinikanth-2.0
2018-07-11 12:55:00

అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా ఇదే నిజం. ఆ చెప్తారు కానీ ఎప్పుడు విడుద‌ల చేస్తారులే అనుకుంటున్నారా..? ఏమో అందులో మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేం కానీ.. ఇప్పుడు ఈ విడుద‌ల తేదీని మాత్రం అనౌన్స్ చేసింది శంక‌రుడే. ఈయనే త‌న ట్విట్ట‌ర్ లో 2.0 విడుద‌ల తేదీ అనౌన్స్ చేసాడు. కొంత కాలంగా 2.0 విడుద‌ల తేదీపై కావాల్సినంత క‌న్ఫ్యూజ‌న్ న‌డుస్తుంది. దీనిపై ఇటు ర‌జినీ కానీ.. అటు శంక‌ర్ కానీ.. మ‌రోవైపు లైకా సంస్థ కానీ ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు నోరు విప్ప‌లేదు. ఇప్పుడు అప్పుడు అంటున్నారే.. ఆ అప్పుడు ఎప్పుడో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేదు. అయితే ఇప్పుడు ఈ చిత్ర విజువ‌ల్ ఎఫెక్ట్స్ చివ‌రిద‌శ‌కు రావ‌డంతో విడుద‌ల తేదీ ప్ర‌క‌టించాడు శంక‌ర్. ముందు దివాళి కానుక‌గా అనుకున్నారు కానీ టెన్ష‌న్ ఎందుకు అని న‌వంబ‌ర్ 29న విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ చేసాడు శంక‌ర్. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న ర‌జినీకాంత్ కు 2.0 కీల‌కంగా మారింది. కాలాతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు ఈ హీరో. త‌న మార్కెట్ ఇంకా ప‌డిపోలేదు అని నిరూపించుకోవాలంటే ముందు 2.0తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవాలి. అలా జ‌ర‌గ‌లేదంటే మాత్రం ఊహ‌కంద‌ని దారుణాలు జ‌రుగుతాయి. 

More Related Stories