English   

ఊపిరి పీల్చుకో.. ర‌జినీ వ‌చ్చేస్తున్నాడు.. 

Rajinikanth-party
2018-03-20 16:50:22

ర‌జినీకాంత్ రాజ‌కీయ అరంగేట్రంపై ప్ర‌క‌ట‌న చేసి మూడు నెల‌లు దాటేసింది. అప్పుడెప్పుడో డిసెంబ‌ర్ లోనే తాను పాలిటిక్స్ లోకి వ‌స్తున్న‌ట్లు తెలిపాడు ర‌జినీకాంత్. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ పార్టీపై ప్ర‌క‌ట‌న కానీ.. ఎలా ఉండ‌బోతుంది అని గానీ చెప్ప‌లేదు. ఇప్పుడు ఆ ముచ్చ‌ట్లు కూడా చెప్ప‌బోతున్నాడు సూప‌ర్ స్టార్. ఇన్నాళ్లూ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని మాత్ర‌మే చెప్పిన ర‌జినీ.. ఇప్పుడు తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏం చేయాల‌నుకుంటున్నానో చెప్ప‌బోతున్నాడు. ఎప్రిల్ 14న త‌మిళుల కొత్త ఏడాది రోజు త‌న పార్టీ సంగ‌తులు చెప్ప‌బోతున్నాడు ర‌జినీ. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ జ‌రుగుతున్నాయి. త‌మిళ కొత్త ఏడాది సంద‌ర్భంగా త‌న పార్టీ పేరుతో పాటు అన్ని విశేషాల‌ను అదే రోజు చెప్ప‌బోతున్నాడు ర‌జినీకాంత్. క‌మ‌ల్ హాస‌న్ ఈ విష‌యంలో ర‌జినీ కంటే తొంద‌ర‌గా ఉన్నాడు. ఈ మ‌ధ్యే త‌న పార్టీ ప్ర‌క‌ట‌న‌తో పాటు ఏం చేయాల‌నుకుంటున్నాడో కూడా చెప్పేసాడు. తానెందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ర‌జినీ కూడా ఇదే చేయ‌బోతున్నాడు. దాంతో అభిమానుల్లో ఆనందానికి అవ‌ధులే లేవు. ర‌జినీ రాజ‌కీయాల్లోకి వ‌స్తే చూద్దాం అని వేచి చూస్తోన్న వాళ్ల‌కు ఎప్రిల్ 14న ఆ కోరిక తీర‌బోతుంది. అన్న‌ట్లు ఆయ‌న వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌బోతున్నారు. క‌మ‌ల్ కూడా ఈ పోటీలో ఉండ‌టం ఇక్క‌డ విశేషం. మొత్తానికి చూడాలిక‌.. ర‌జినీ రాజ‌కీయ చ‌ద‌రంగం ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories