English   

రజినీకాంత్ కాలాకు సమస్యలు ఉంటాయా..?

Rajnikanth-kaala
2018-02-17 10:43:24

బహుశా ఉండకపోవచ్చు. ఈ వేసవిలో వస్తుందనుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ 2.0 ఎప్పుడు వస్తుందో కూడా తెలియనంతగా పోస్ట్ పోన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు సడెన్ గా కాలాను లైన్లోకి తెచ్చారు. 2.0 రిలీజ్ కావాల్సిన డేట్ లో కాలాను విడుదల చేస్తున్నారు. రజినీకాంత్ తో కబాలి చేసిన పా. రంజిత్ కాలాకు దర్శకుడు. కోలీవుడ్ స్టార్ హీరో, రజినీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు కాలా విడుదల టైమ్ కు తెలుగులో సూపర్ స్టార్ మహేస్ బాబు భరత్ అనే నేను, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరుసూర్య నా ఇల్లు ఇండియా విడుదలవుతున్నాయి. దీంతో రజినీకి ప్రాబ్లమ్స్ తప్పవు అనుకుంటున్నారు చాలామంది. ఒక రకంగా కబాలి పోవడం వల్ల అది నిజమే అయినా ధనుష్ ప్లాన్స్ వేరేగా ఉన్నాయి. అందుకే ధైర్యంగా ఈ సినిమాను మన స్టార్స్ తో పోటీగా విడుదల చేసేందుకు రంగం సిధ్ధం చేసుకుంటున్నాడు. 

నిజానికి రజినీ నుంచి ఓ సినిమా వస్తోందంటే డబ్బింగ్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. కానీ ఈ సారి అలా జరగడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంత వరకూ ఎవరూ డబ్బింగ్ రైట్స్ అడగలేదట. దీంతో ధనుష్ కొంత ఆశ్చర్యపోయినా.. అతని ప్లాన్ చూస్తే కాలకు వచ్చిన ప్రాబ్లమ్సేం లేవని తెలుస్తుంది. గతంలో రజినీ సినిమాలు భారీ బడ్జెట్ తో ఉండేవి. కానీ కాలా అలా కాదు. చాలా తక్కువ బడ్జెట్ లోనే దీన్ని పూర్తి చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్స్ అంటూ ఏం లేవు. అందువల్ల భారీ రేట్ రాకపోయినా వచ్చే రేట్ కు అమ్మేస్తారు. ఎంత లేదన్నా రజినీ మూవీ అంటే ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ విషయం కొనే ఎవరికైనా తెలుసు. అదీ కుదరదంటే ధనుష్ తనే స్వయంగా రిలీజ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇది కొంత రిస్క్ అయినా.. ఎవరు కొన్నా ఇబ్బంది లేదనేది నిజం. మహేష్ బాబు, బన్నీ సూపర్ హిట్స్ కొట్టినా.. కాలా ఏ మాత్రం బావుందనే టాక్ వచ్చినా మాగ్జిమం బయటపడుతుందనేది నిజం.  

More Related Stories