English   

రాజుగారి గ‌ది 3 ట్రైల‌ర్...భయం భయం

rgg3
2019-09-15 19:58:05

హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన రాజుగారి గది సిరీస్ లోని మొదటి రెండు సినిమాలు హిట్ కొట్టాయి. దీంతో ఈ సిరీస్ లో  మూడో సినిమాకు ఓంకార్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రాజుగారి గది3 సినిమాలో లీడ్ రోల్ మొదట తమన్నా అనుకుని పూజా కార్యక్రమాలు కూడా చేసేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ ఆమె సడెన్ గా తప్పుకుని షాకిచ్చింది. ఆ తర్వాత తమన్నా స్థానంలో తాప్సి అన్నారు, కాజల్ అన్నారు. హీరోయిన్ గా రష్మీని తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ పుకార్లే అని తెల్చేస్తూ అవికా గోర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది  సినిమా యూనిట్. ఈరోజు ట్రైలర్ విడుదలైంది.  ట్రైలర్‌ లో భయంకరమైన ఎక్స్ ప్రేషన్స్ తో అవికాగోర్ అదరగొట్టింది.

ఇక అశ్విన్‌ కి దెయ్యం పట్టినట్లు చూపడం సినిమా మీద ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక అమ్మాయిని చంపి ఒక బంగ్లాలో పూడ్చిపెట్టడం, దాంతో ఆమె ప్రేతాత్మ దెయ్యంగా మారి భయపెట్టడం వంటి విషయాలను ఈ సినిమా ట్రైలర్ లో చూపించాడు ఓంకార్. ట్రైలర్ వరకు బాగానే ఉన్నా కథ బాగోపోతే ఇబ్బందే. ఛోటా.కె.నాయుడు విజువల్స్, షబీర్ ఆర్.ఆర్ తో ఎఫెక్టివ్‌గా ట్రైలర్ లో హారర్ ఫీల్ తెప్పించిన ఓంకార్, సినిమాని ఏమి చేయనున్నాడో మరి.ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేస్తున్నారు. 'సైరా' లాంటి భారీ సినిమానే కాక వేరే సినిమాల తాకిడి కూడా ఉన్న దసరా బరిలో రాజుగారిగది-3 ఏ రేంజ్‌ ఫలితం అందుకుంటుందో చూడాలి.

 

More Related Stories