English   

రాజ్ త‌రుణ్ రాజుగాడు:ప్రివ్యూ

rajugadu preview
2018-05-31 12:21:22

కాలం క‌లిసిరాక‌పోతే తాడే పామై కాటేస్తుందంటారు. ఇప్పుడు రాజ్ త‌రుణ్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో మ‌నోడి టైమ్ గిర్రున తిరిగింది. ఏకంగా మూడు వ‌ర‌స విజ‌యాలు అందుకున్నాడు. దాంతో రాజ్ త‌రుణ్ కు కొన్నేళ్ల పాటు తిరుగుండ‌దు అనుకున్నారంతా. కానీ తిరిగిన టైమ్ తిర‌గ‌బ‌డ‌టానికి కూడా ఎంతో టైమ్ ప‌ట్ట‌లేదు. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకున్న చోటే ఇప్పుడు వ‌ర‌స‌గా ప‌రాజ‌యాలు అందు కుంటూ ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. పండ‌క్కి వ‌చ్చిన రంగుల రాట్నం కూడా ఈ కుర్రాడి క‌ల‌ల్ని నెర‌వేర్చ‌లేదు. ఇక ఇప్పుడు మ‌రో మ‌హిళా ద‌ర్శ‌కురాలు సంజ‌నరెడ్డితో చేసిన రాజుగాడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రం జూన్ 1న విడుద‌ల కానుంది. ఇందులో దొంగ‌గా న‌టించాడు రాజ్ త‌రుణ్. కావాల‌ని దొంగ‌త‌నాలు చేయ‌డం కాదు కానీ అదో జ‌బ్బు అన్న‌మాట‌. అలాంటి విచిత్ర‌మైన కారెక్ట‌ర్ చేస్తున్నాడు రాజ్ త‌రుణ్. రాజేంద్ర ప్ర‌సాద్ కామెడీ సినిమాకు మ‌రో బోన‌స్. ఇప్పుడు ఈ కుర్రాడి ఆశ‌ల‌న్నీ రాజుగాడుపైనే ఉన్నాయి. అమైరా ద‌స్తూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించింది. మ‌న‌సుకు న‌చ్చింది త‌ర్వాత ఈమె చేసిన తెలుగు సినిమా ఇదే. ఇప్పుడు రాజ్ త‌రుణ్ కెరీర్ గాడిన ప‌డాలంటే రాజుగాడు క‌చ్చితంగా హిట్ కావాల్సిందే.. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. ఈ చిత్రం త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్ లో అలా ఎలా ఫేమ్ అనీల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ‌ర్ సినిమా చేస్తున్నాడు రాజ్ త‌రుణ్. మొత్తానికి అది ఎలా ఉన్నా ముందు రాజుగాడుతో ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నాడు ఈ కుర్ర హీరో. మ‌రి ఈయ‌న ఆశ‌ల్నీ సంజ‌నా రెడ్డి ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలి..!

More Related Stories