English   

శ్రీ రెడ్డిపై కేస్ పెట్టిన శేఖర్ మాస్టర్ గురువు రాకేష్..

srireddy
2020-02-20 06:52:51

శ్రీ రెడ్డి మరోసారి సంచలనం రేపుతుంది. తనను కావాలనే కళ్యాణి, రాకేష్ మాస్టర్ టార్గెట్ చేస్తున్నారంటూ రెచ్చిపోయింది. మొన్నటికి మొన్న కళ్యాణితో పాటు రాకేష్ మాస్టర్ కూడా డిబేట్స్ లో కూర్చుని శ్రీ రెడ్డిని టార్గెట్ చేయడంతో ఆమె కూడా రెచ్చిపోయింది. తన ఫేస్ బుక్ లో రాకేష్ మాస్టర్ పై ఓ రేంజ్ లో మండిపడింది.. ‘‘ఒరేయ్ రాకేష్‌గా నీకు ఎప్పుడో నా చేతిలో బాగా గట్టిగా పడతాయి. అసలు నీ గురించి నేను ఎప్పుడూ ఇంటర్వ్యూలో తప్పుగా మాట్లాడింది లేదు. నేనేదో రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఓ పార్టీకి నన్ను పిలిచారు, నాకు తీరిక లేక వెళ్లలేదు అని చెప్పుకున్నాను. అందులో తప్పేముంది? కరోనా వైరస్, కుక్కలు అని ఏవేవో మాట్లాడుతున్నావ్. నీకెంత మంది పెళ్లాలు లేర్రా? నేను నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడట్లేదు. నాలుగు కుప్పిగంతులు వేసేసినంత మాత్రాన నువ్వు డ్యాన్సర్‌వి అయిపోవు. నిన్ను డ్యాన్సర్‌గా కాకుండా నువ్వేంటో తెలిసినదాన్ని నేను’’ అంటూ రెచ్చిపోయింది ఈ భామ.
అక్కడితో ఆగకుండా.. ‘‘నేను డిబేట్‌కి వచ్చి నీతో మాట్లాడేది ఏంటిరా రాకేష్‌గా. అసలు నీ స్థాయి ఏందిరా? నీకు పాపులారిటీ కావాలి అందుకే నా పేరు వాడుకుంటున్నావ్. నేను మూడు రోజుల నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నా. దమ్ముంటే ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను పోలీసులు అరెస్ట్ చేసినా ఫర్వాలేదు. హ్యాపీగా జైల్లో కూర్చుంటాను. నాకు పోలీసు వ్యవస్థపై నమ్మకం ఉంది. నాకూ పోలీసుల్లో ఫ్రెండ్స్ ఉన్నారు..’’ అంటూ విమర్శించింది.
అంతేనా.. మళ్లీ కూడా మరో వీడియోలో ‘‘ఏరా రాకేష్ ఇంతకాలం నామీద పడి ఏడ్చావ్ కదా. నీకు దమ్ముంటే చిరంజీవి కూతురి గురించి మాట్లాడురా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. చిరంజీవి ఫ్యామిలీపై నేను కామెంట్స్ చేసాను కాబట్టి మీరంతా నా గురించి డిబేట్లు పెట్టి తప్పుగా మాట్లాడితే.. మీపై మెగా ఫ్యామిలీ ఫోకస్ ఉంటుందనేగా మీ ప్లాన్. అంత సీన్ లేదు. ఏదో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పిలిచేస్తాడు అనుకుంటున్నారా? అసలు పవన్ గెలవడు. వాడు ఎలా గెలుస్తాడు?’’ అంటూ ప్రశ్నించింది శ్రీ రెడ్డి.
చివరగా కంక్లూజన్ ఇస్తూ.. ‘‘రేయ్ రాకేష్‌గా.. నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాకు ఆడి కారు ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవడమే నీ డ్యూటీనా. నాకు డబ్బున్న తల్లిదండ్రులు ఉండకూడదా? నా పేరెంట్స్‌కి ఎంత ఆస్తి ఉందో తెలుసా నీకు? నేను బాగా డబ్బున్న రెడ్డి కుటుంబం నుంచి వచ్చాను..’’ అంటూ ముగించింది. ఇప్పుడు తనను ఇష్టమొచ్చినట్లు దూషించిందంటూ శ్రీ రెడ్డిపై కేస్ పెట్టాడు రాకేష్ మాస్టర్. నీ బండారం బయటపెడతా అంటూ ఆమెకు వార్నింగులు ఇస్తున్నాడు.

More Related Stories