English   

రాక్షసుడు 10 డేస్ కలెక్షన్స్.. బెల్లంకొండకు విజయం దూరపుకొండే.. 

 Rakshasudu
2019-08-13 08:41:46

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏం కోరుకోవడం లేదు.. ఒకే ఒక్క హిట్ కావాలంటున్నాడు. కానీ దేవుడు కరుణించడం లేదు. బ్లాక్ బస్టర్ టాక్ తో ఓపెన్ అయిన సినిమా కూడా ఇప్పుడు కలెక్షన్లు రావడం లేదు. దాన్ని బట్టి ఈ హీరో దురదృష్టాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఒక్క హిట్టు కొట్టాలని కలలు కంటున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు రాక్షసుడు సినిమాతో వచ్చాడు. థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజే టాక్ అద్భుతంగా వచ్చింది. దాంతో కచ్చితంగా బెల్లంకొండ హిట్ కొట్ఠడం ఖాయం అనుకున్నారంతా. కానీ ఇప్పుడు 10 రోజుల తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. రాక్షసుడు సినిమాకు ఇప్పటి వరకు 10 రోజుల్లో వచ్చింది 10.78 కోట్లు మాత్రమే. ఇంకా 6 కోట్లకు పైగా షేర్ వస్తే కానీ హిట్ అనిపించుకోదు ఈ చిత్రం. ఇప్పటికే రెండు వారాలు పూర్తి కావడంతో ఫుల్ రన్ కు దగ్గర పడుతుంది రాక్షసుడు. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి ఇంకా ఎన్ని వసూళ్లు వస్తాయనేది ఆసక్తిగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే రాక్షసుడు చిత్రం నామమాత్రపు వసూళ్లే తీసుకొస్తున్నాడు. చాలా చోట్ల ఎండ్ రన్ కు చేరువైంది ఈ చిత్రం. 16.7 కోట్ల బిజినెస్ తో ఈ చిత్రం జర్నీ మొదలైంది. 11 రోజుల తర్వాత 11 కోట్లు మాత్రమే వసూలు చేసింది. బెల్లంకొండ గత సినిమాలు మంచి వసూళ్లు తీసుకొచ్చేవి. కానీ కొన్నేళ్లుగా అది కూడా జరగడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా ఇంకా సేఫ్ జోన్ కు రాకపోవడంతో నిర్మాతలతో పాటు బయ్యర్లు కూడా కంగారు పడుతున్నారు. మరి చూడాలిక.. చివరి వరకు ఏం జరుగుతుందో..?

More Related Stories