English   

రాక్షసుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ !

Rakshasudu
2019-08-10 12:27:36

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రాక్షసుడు మూవీ దిగ్విజయంగా మొదటి వారం పూర్తిచేసుకుంది. తమిళ సూపర్ హిట్ సినిమా రాక్షసన్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి ఆట ఉండే పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ ప్రభావం వల్ల మొదటి రోజు కూడా రాక్షసుడు సరయిన కలెక్షన్స్ సాదించలేదు. అయితే పాజిటివ్ టాక్ వచ్చిన నేపధ్యంలో శని, ఆదివారాల్లో వసూళ్లు పెరిగాయి మళ్ళీ సోమవారం నుంచి డ్రాప్ మొదలైంది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్ లో 8 కోట్ల 77 లక్షల షేర్ రాబట్టింది. ఏరియాల వారీగా రాక్షసుడు ఫస్ట్ వీక్ షేర్ ఇలా ఉంది. తెలంగాణ – 3. 15 కోట్లు, సీడెడ్ – 1. 07 కోట్లు, ఈస్ట్ – 58 లక్షలు, వెస్ట్ – 44 లక్షలు, కృష్ణా – 61 లక్షలు, గుంటూరు – 61 లక్షలు, నెల్లూరు – 24 లక్షలు, ఉత్తరాంధ్ర – 1. 12 కోట్లు., ఓవర్ సీస్ – 30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా – 65 లక్షలు, మొత్తంగా చూస్తే 8. 77 కోట్లు సాధించి పెట్టింది. అయితే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్ల వరకు జరిగింది. అయితే ఇప్పటికి 8.7 కోట్ల షేర్ వచ్చింది కాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 8 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాల్సి ఉంది. అలా రాబడితేనే ఈ సినిమా కమర్షియల్ హిట్ ల జాబితాలో చేరనుంది.
 

More Related Stories