English   

అయ్యారే.. ర‌కుల్ ఆశ‌లు తెల్లారే..!

rakul-preet-singh

బ్యాడ్ ల‌క్ బ్యాక్ పాకెట్ లో ఉన్న‌పుడు ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తే మాత్రం ఏం లాభం..? కాలం క‌లిసిరాక‌పోతే తాడే పామై కాటేస్తుంది కూడా. ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ ప‌రిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. తెలుగు ఇండ‌స్ట్రీని కాద‌ని.. బాలీవుడ్ కు వెళ్లిన ర‌కుల్ కు ఆశ‌ల‌న్నీ తెల్లారిపోయేలా క‌నిపిస్తున్నాయి. ఈమె న‌టించిన అయ్యారీ సినిమా రెండు మూడు వాయిదాల త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు అప‌జ‌యం అంటూ లేని నీర‌జ్ పాండే దీనికి ద‌ర్శ‌కుడు కావ‌డంతో అమ్మాయిగారు త‌న సెకండ్ ఇన్నింగ్స్ కు ఎలాంటి ఢోకా లేద‌ని నిశ్చింత‌గా ఉన్నారు. కానీ ఏం చేస్తాం.. ఈ సినిమాకు ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్ లో నెగిటివ్ టాక్ వ‌చ్చేసింది. దానికి తోడు ఓపెనింగ్స్ కూడా ఊహించినంత రాలేదు. 

క‌థ బాగానే ఉన్నా.. దాన్ని డీల్ చేసే విధానంలో మాత్రం నీర‌జ్ పాండే గాడి త‌ప్పాడంటున్నారు ప్రేక్ష‌కులు. ఇక ఎప్పుడూ స్క్రీన్ ప్లేతోనే క‌ట్టిప‌డేసే నీర‌జ్.. ఈ సారి అదే మిస్ చేసాడంటున్నారు విశ్లేష‌కులు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేసేలా అయితే క‌నిపించ‌ట్లేదు. క‌చ్చితంగా ఏదో తేడాలాగే అనిపిస్తుంది. ఎన‌నో ఆశ‌ల‌తో బాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన ర‌కుల్ కు అయ్యారీ ఆశ‌లు తెల్లారేలా చేసింది. అక్క‌డ ఆశ‌లు పెట్టుకుని ఈ మ‌ధ్యే తెలుగు ఇండ‌స్ట్రీని విమ‌ర్శించింది కూడా ఈ భామ‌. ఇక్క‌డ స‌రైన క‌థలు రావ‌ట్లేద‌ని.. అందుకే బాలీవుడ్ లో న‌టిస్తున్నాన‌ని చెప్పింది ర‌కుల్. మ‌రి ఇప్పుడు ఈ భామ ఏం చేయ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories