English   

ర‌కుల్ కు రుణ‌డిపోయిన పూజా.. 

Pooja-hedge
2018-03-24 17:12:52

పూజాహెగ్డే.. ఫ్యూచ‌ర్ తెలుగు ఇండ‌స్ట్రీ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్. అదేంటి.. ముందే ఎలా చెబుతున్నారు అనుకుంటున్నారా..? ఈమె చేస్తోన్న సినిమాల లిస్ట్ చూస్తుంటే అలా ఉంది మ‌రి. డిజే త‌ర్వాత ఆర్నెళ్లు ఖాళీగా ఉంటే పూజాను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదే పాపం అనుకున్నారంతా. కానీ అది తుఫాన్ ముందు ప్ర‌శాంత‌త అని ఎవ‌రూ అనుకోలేదు. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లంలో ఐటం సాంగ్ చేసింది పూజాహెగ్డే. జిగేల్ రాణి అంటూ ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఇక ఇప్పుడు ఈ భామ చేతిలో నాలుగు భారీ సినిమాలున్నాయి. ఇందులో బెల్లంకొండ సాక్ష్యంను ప‌క్క‌న‌బెడితే.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమా.. మ‌హేశ్-వంశీ పైడిప‌ల్లి సినిమా.. ప్ర‌భాస్-రాధాకృష్ణ సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒక్క సినిమా విష‌యంలో మాత్రం ర‌కుల్ కు పూర్తిగా రుణ‌ప‌డిపోయింది పూజాహెగ్డే. త్రివిక్ర‌మ్ సినిమాలో ముందు ర‌కుల్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమెకు క‌థ కూడా న‌చ్చింది కానీ త‌మిళనాట మూడు సినిమాలు.. హిందీలో రెండు సినిమాలు చేస్తుండ‌టంతో ర‌కుల్ ఈ చిత్రాన్ని ఒప్పుకోలేదు. ఎంత అడ్జ‌స్ట్ చేసుకుందాం అనుకున్నా డేట్స్ కుద‌ర్లేదు. దాంతో ర‌కుల్ ఆఫ‌ర్ కాస్తా పూజాకు వెళ్లిపోయింది. ఎన్టీఆర్ సినిమా ఏ ముహూర్తాన ఒప్పుకుందో తెలియ‌దు కానీ వ‌ర‌స‌గా భారీ ఆఫ‌ర్లు అన్నీ పూజా ముందు క్యూ క‌డుతున్నాయి. ఇప్పుడు చెప్పండి.. ర‌కుల్ కు పూజా రుణ‌ప‌డిపోయిన‌ట్లే క‌దా..!

More Related Stories