English   

ర‌కుల్ కూడా రాజ‌కీయం చేస్తుందా..? 

Rakul-app
2018-03-21 14:37:45

ర‌కుల్ ఏంటి.. రాజ‌కీయాలు చేయ‌డం ఏంటి.. అయినా త‌న‌కు అంత టైమ్ ఎక్క‌డుంది అనుకుంటున్నారా..? అవును నిజ‌మే ర‌కుల్ కు రాజ‌కీయం చేసేంత టైమ్ లేదు. కానీ రాజ‌కీయాల గురించి మాట్లాడే టైమ్ అయితే ఉంది క‌దా..! ఇప్పుడు ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. త‌న యాప్ లాంఛ్ కోసం హైద‌రాబాద్ కు చాలా రోజుల త‌ర్వాత వ‌చ్చింది ర‌కుల్. ఇప్పుడు ఈ భామ చూపుల‌న్నీ బాలీవుడ్ పైనే ఉన్నాయి. 

అక్క‌డే అవ‌కాశాల కోసం చూస్తున్న ర‌కుల్ కు తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఆన‌డం లేదు. అడిగితే కావాల‌నే తెలుగులో బ్రేక్ ఇచ్చాన‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి నిజం గానే బ్రేకిచ్చిందా.. లేదంటే మ‌నోళ్లే ర‌కుల్ జోరుకు బ్రేకులేసారా అనేది ఆస‌క్తిక‌ర‌మే. ఇదిలా ఉంటే హీరోల రాజ‌కీయాల గురించి కూడా మాట్లాడేసింది ఈ భామ‌. ర‌జినీకాంత్.. క‌మ‌ల్ హాస‌న్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి హీరోలు త‌న దృష్టిలో బాగా ఛ‌రిష్మాటిక్ హీరోలు అని.. వాళ్లు రాజ‌కీయాల్లోకి వ‌స్తే మంచే జ‌రుగుతుంద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. వాళ్ల‌నే కాదు.. ఎవ‌రైనా మంచి చేయాల‌నుకుంటే పాలిటిక్స్ లోకి రావచ్చ‌ని చెప్పింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ముఖ్యంగా ప‌వ‌న్ లాంటి వాళ్లు రాజ‌కీయాల్లో ఉండ‌టం చాలా మంచిద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి అల‌వాటు లేక‌పోయినా.. త‌న‌కు తెలిసిన రాజ‌కీయాలు మాత్రం బాగానే మాట్లాడేసింది ఈ ముద్దుగుమ్మ‌. 

More Related Stories