English   

Rakul Preet Singh: అతనికి డబ్బులు ఎందుకు పంపారు.. 5 గంటలుగా రకుల్‌ను విచారిస్తున్న ఈడీ అధికారులు?

Rakul Preet Singh
2021-09-03 15:43:25

Rakul Preet Singh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని డ్రగ్ మాఫియా మనీలాండరింగ్ కేసులు టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సినీ తారలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.మనీలాండరింగ్ విషయంలో చిత్రపరిశ్రమకు చెందిన 12 మందికి ఈడీ అధికారులు నోటీసులను జారీ చేశారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్ నటి ఛార్మిని విచారించిన ఈడీ అధికారులు తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ ను విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం ఈడి కార్యాలయానికి చేరుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ను గత ఐదుగంటల నుంచి అధికారులు పలు ప్రశ్నలు కురిపిస్తూ.. ఆమె దగ్గర నుంచి సమాధానాలను రాబడుతున్నారు.

ఈ విచారణలో భాగంగా అధికారులు బాంబే, హైదరాబాద్, ఢిల్లీ లలో ఉన్నటువంటి ఈమె బ్యాంక్ వివరాలను రాబడుతున్నారు. అలాగే హైదరాబాద్లో రకుల్ ఫిట్నెస్ సెంటర్, సెంటర్ బ్యాంకు ఖాతాలను కూడా సేకరించి వాటి గురించి అధికారులు ఆమెను ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ నుంచి పెద్ద ఎత్తున క్లబ్ మేనేజర్ కి డబ్బులను పంపినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ మాఫియాలో ప్రధాన నిందితుడు అయినటువంటి కెల్విన్ కి కూడా ఎక్కువ సార్లు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విధంగా ఈమె పై ఉన్న కొన్ని అనుమానిత లావాదేవీల గురించి రకుల్ ప్రీత్ సింగ్ ను అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం రకుల్ ను మాత్రమే కాకుండా ఆడిటర్ ని కూడా విచారిస్తున్న ఈడీ అధికారులు కెల్విన్, ఎస్ క్లబ్ మేనేజర్లతో చాటింగ్ వివరాలను కూడా సేకరిస్తూ విచారణను కొనసాగిస్తున్నారు.

More Related Stories