English   

రకుల్ కి ఏమైందబ్బా ?

Rakul-Preet-singh
2019-03-16 11:19:42

చక్కనమ్మ చిక్కినా అందమే అని రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు అంత సన్నగా మారిపోయిందనే విషయం అర్థం కాక అభిమానులు కూడా కంగారుపడుతున్నారు. ఏదైనా సినిమా కోసం ఎంతగా బరువు తగ్గిందా ? తెలుగులో అవకాశాల కోసమే మరి జీరో సైజ్ మారిపోయిందా ? అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే దీని వెనుక రకుల్ ప్రీత్ సింగ్ చెబుతున్న కథ మాత్రం మరోలా ఉంది  సినిమా అవకాశాలు ఉన్నా లేకపోయినా తను మాత్రం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు జిమ్ కు వెళ్లి చెమట చిందిస్తుంది ఈ ముద్దుగుమ్మ. దాని కారణంగానే బరువు కూడా తగ్గిపోయింది. ఎలాగో తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు కాబట్టి హిందీలో ట్రై చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఉత్తరాది ప్రేక్షకులకు జీరో సైజ్ అందాలంటే చాలా ఇష్టం దానికోసమే ఇప్పుడు జీరో సైజ్ లోకి మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. మొన్నటి వరకు కాస్త బొద్దుగా ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు మాత్రం చాలా సన్నగా మారిపోయి ఎవరు గుర్తుపట్టని విధంగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు రకుల్ ప్రీత్. అయితే బాలకృష్ణ బోయపాటి సినిమాలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది  జూన్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కనుంది ఈ సినిమా.

More Related Stories