English   

ఓటిటి ప్లాట్‌ఫామ్‌పై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

rakul
2020-05-29 06:47:15

కరోనా కారణంగా కొన్ని రోజులుగా ఓటిటి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. థియేటర్స్ తెరిచే వరకు తమ సినిమాలను విడుదల చేయకుండా ఆపుకోలేని కొందరు నిర్మాతలు డిటిటల్ ప్లాట్ ఫామ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అక్కడ మంచి రేట్ కు తమ సినిమాలను అమ్మేసుకుంటున్నారు. అలా కొద్దోగొప్పో నష్టాల నుంచి బయట పడుతున్నారు. అయితే దీనిపై కొందరు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అర్థం చేసుకుని థియేటర్స్ తెరిచే వరకు ఓర్పుతో ఉండాలి కానీ అలా విడుదల చేస్తే ఇంకెందుకు సినిమాలు చేయడం అంటూ మండి పడుతున్నారు. దీనిపై ఇప్పుడు రకుల్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేసింది. తను నటించిన సినిమాలను ఏ ప్లాట్‌ఫామ్ పై విడుదల చేసినా తనకేం అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది ఈమె.

కానీ కొన్ని సినిమాలను థియేటర్లలో చూస్తేనే బాగుంటుంది.. ఆ ఫీల్ మిస్ కాకుండా ఉంటుందని చెప్పింది. అయితే వాటిని ఎలా విడుదల చేయాలనే దానిపై తుది నిర్ణయం మాత్రం నిర్మాతల చేతుల్లోనే ఉంటుందని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఎందుకంటే ఆ సినిమాపై పెట్టుబడి పెట్టేది నిర్మాత కాబట్టి ఆయనకే పూర్తి హక్కులు ఉంటాయని చెప్పుకొచ్చింది. డిజటల్‌లో విడుదల చేయడమే సరైన నిర్ణయం అని నిర్మాతలకు అనిపిస్తే అది వాళ్ల యిష్టం.. వాళ్ల కంటే బాగా నిర్ణయాలు తీసుకోగలిగిన వారెవరంటూ ప్రశ్నించింది రకుల్ ప్రీత్ సింగ్. వాళ్ల పెట్టుబడికి లాభాలు రాకపోయినా పర్లేదు కానీ నష్టాలు అయితే రాకూడదు కదా.. అలాంటప్పుడు వాళ్లేం చేసినా మంచిదే అంటుంది రకుల్. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

 

More Related Stories