English   

తమ్ముడిని వదిలేసి అన్నను పట్టుకొన్న రకుల్

Rakul Preet Singh Joined in Surya's NGK Shoot
2018-08-03 09:32:28

ఈ హీరోయిన్ల‌కు ఫ్యామిలీ ఆఫ‌ర్ భ‌లేగా దొరుకుతుంది. కుటుంబంలో ఒక్క హీరోతో న‌టిస్తే చాలు.. ఆటోమేటిక్ గా వ‌ద్ద‌న్నా మిగిలిన హీరోల నుంచి కూడా ఆఫ‌ర్లు వ‌స్తుంటాయి. తెలుగులో మెగా.. నంద‌మూరి.. అక్కినేని ఫ్యామిలీస్ ఇదే ఫార్ములా ఫాలో అవుతుంటారు. సూర్య‌.. కార్తి కూడా దీనికి మిన‌హాయింపు కాదు. సూర్య ఛాన్స్ ఇస్తే.. కార్తి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లే. కార్తి ఇస్తే సూర్య‌తో జోడీ క‌ట్టిన‌ట్లే. ఇప్పుడు ర‌కుల్ కు కూడా ఇదే బంప‌ర్ ఆఫ‌ర్ న‌డుస్తుంది. ఈమె గ‌తేడాది ఖాకీ సినిమాలో కార్తితో రొమాన్స్ చేసింది.

అది పూర్తైన త‌ర్వాత ఇప్పుడు దేవ్ లో మ‌రోసారి కార్తితోనే రొమాన్స్ చేస్తుంది ర‌కుల్. ఈ చిత్ర షూటింగ్ మొన్న‌టి వ‌ర‌కు ఉక్రెయిన్ లో జ‌రిగింది. దానికి నెల రోజుల ముందే అజ‌య్ దేవ్ గ‌న్-ల‌వ్ రంజ‌న్ సినిమా కోసం లండ‌న్ వెళ్లింది ర‌కుల్. అక్క‌డ్నుంచి కార్తి కోసం ఉక్రెయిన్.. ఇప్పుడు అక్క‌డ షూటింగ్ పూర్తి చేసుకుని సూర్య కోసం చెన్నై వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం సూర్య‌తో ఎన్జికే సినిమాలో న‌టిస్తుంది ఈ భామ‌. సెల్వ రాఘ‌వన్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి మ‌రో హీరోయిన్ గా న‌టిస్తుంది. మొత్తానికి  త‌మ్ముడుతో మొన్న‌టి వ‌ర‌కు రొమాన్స్ చేసి.. ఇప్పుడు అన్న‌య్య కావాలంటూ వ‌చ్చేసింది ర‌కుల్.

More Related Stories