English   

రేట్ తగ్గిస్తా.. ఆఫర్ ఇస్తారా..?

Rakul-Preet-Singh
2018-03-07 07:30:48

అంటోంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. యస్.. ఆ మధ్య టాలీవుడ్ నెంబర్ వన్ అన్నంత పనిచేసిన అమ్మడికి సడెన్ గా ఆఫర్స్ ఆగిపోయాయి. దీంతో కొన్నాళ్లు బాలీవుడ్ లోనూ పాగా వేయాలని ఏకంగా బికినీ షూట్ లూ చేసింది. కానీ ఆ అందాల ప్రదర్శన అంతా వృథా అయిపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు ఆఫర్స్ కొట్టేసింది కూడా. కోలీవుడ్ క్రేజీ బ్రదర్స్ సూర్య, కార్తీల సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ కొట్టేసిన రకుల్ కు అక్కడ క్రేజ్ వస్తుందన్న గ్యారెంటీ లేదో ఏమో.. రేట్ తగ్గిస్తాను ఆఫర్స్ ఇస్తారా అంటూ టాలీవుడ్ వైపు ఫీలర్స్ వదులుతోంది. నిజానికి లాస్ట్ ఇయర్ రకుల్ కు మిక్స్ డ్ రిజల్ట్ వచ్చింది. చేసిన ఐదు సినిమాల్లో మూడు సినిమాలు హిట్ అయ్యాయి. విన్నర్, స్పైడర్, డిజాస్టర్ అయితే.. జయజానకి నాయక, రారండోయ్ వేడుక చూద్దాం, ఖాకీ సినిమాలు బాగా ఆడాయి. అయినా ఆశ్చర్యంగా తెలుగులో కొత్త చాన్స్ లేదు. ఈ మధ్యలో బాలీవుడ్ లో ఓ సినిమా చేసింది. లాస్ట్ ఇయరే బాలీవుడ్ లో చేసిన అయ్యారీ ఈ మధ్యే విడుదలై అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నిజానికి ఈ బాలీవుడ్ మూవీపై బోలెడు ఆశలు పెట్టుకుంది రకుల్. అందుకే మధ్యలో కొన్ని తెలుగు సినిమాలు వచ్చినా కాదందట. ఇప్పుడు అది కాస్తా పోవడంతో మళ్లీ తెలుగులో పాగా వేయడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. కానీ అవేవీ ఫలించేలా కనిపించడం లేదు. 

ఈ లోగా ఖాకీ ఫలితమా అని కోలీవుడ్ లో ఆఫర్ వచ్చింది. సూర్య సరసన. కానీ ఇందులో తను సెకండ్ హీరోయిన్. ఇప్పుడు కార్తీతో చేసే సినిమాలోనూ హీరోయిన్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని టాక్. ఈ కారణంగానే మళ్లీ టాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ చాన్స్ ఇచ్చేవారెవరు. అందుకే రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అనే ఫీలర్స్ వదులుతోంది. ఇవి ఫిలిస్తే ఒక చాన్స్ రావచ్చు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే.. రకుల్ ఆల్రెడీ దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబోలో వస్తుందనుకున్న మూవీలో ఓకే అయింది. కానీ ఈ మూవీకి హీరోలు దొరకడం లేదు. దీంతో వచ్చిన చాన్స్ కూడా పోయేలా ఉంది. ఒకవేళ హీరో దొరికినా రకుల్ వద్దంటే అంతే. మరి ఈ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా అనే ఫీలర్స్ తో అయినా అమ్మడికి కొత్త ఆఫర్స్ వస్తాయోమో చూడాలి. 

More Related Stories