English   

కరోనా దెబ్బకు రకుల్ బిజినెస్ డమాల్ అయ్యిందట

Rakul Preet Singh
2021-03-01 17:48:21

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వుంది. మొదట బాలీవుడ్ లోనే లక్ ను పరీక్షించుకున్న ఈ భామ అక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కి మకాం మార్చింది. అయితే ఇప్పుడు రకుల్ కు మళ్ళీ బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అనే సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 

రకుల్ సినిమాలతో పాటు ఎఫ్ 45 పేరుతో జిమ్ బిజినెస్ ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్వ్యూ లో రకుల్ ను జిమ్ బిజినెస్ ఎలా నడుస్తుంది అని అడగ్గా కరోనా ఎఫెక్ట్ తన బిజినెస్ ను దెబ్బ తీసిందని చెప్పింది. కరోనా టైమ్ లో జిమ్ లు మూత పడ్డాయని దాంతో నష్టాలు వచ్చాయని తెలిపింది. అయినప్పటికీ అందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం జీతాలు చెల్లించామని చెప్పింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే తన బిజినెస్ గట్టెక్కుతోందని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా రకుల్ ప్రీత్ త్వరలో మరో బిజినెస్ ను కూడా ప్రారంభించబోతుంది. అయితే అధికేవలం రాజకీయనాయకులకు మరియు సెలబ్రెటీలకు యోగా క్లాసులు నిర్వహించడమట. మరి రకుల్ యోగా బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూడాలి.

More Related Stories