English   

రకుల్ అక్కడే సెటిల్ అయ్యేలా ఉంది

rakul-Preet-Singh
2018-06-28 17:10:27

కొన్నాళ్ల పాటు తెలుగులో ఓ వెలుగు వెలిగిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. కానీ లాస్ట్ ఇయర్ నుంచి అమ్మడిని ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా అని ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇచ్చినా ఆఫర్స్ మాత్రం రావడం లేదు. బట్ ఇదే టైమ్ లో తమిళ్ లో బిజీ అవుతోందీ బ్యూటీ. లాస్ట్ ఇయరే అక్కడ ఖాకీ అనే సినిమాతో హిట్ అందుకుంది. ఆడియన్స్ కూ అక్కడ బానే నచ్చినట్టుంది. అందుకే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి తమిళ్ లో. కార్తీతో ఖాకీ చేసిన వెంటనే సూర్యతో ఎన్జీకే అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ కార్తీతో మరో సినిమా కూడా చేయబోతోంది. అటు హిందీలోనూ అజయ్ దేవ్ గణ్ సరసన ఓ ఆఫర్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా అమ్మడి అకౌంట్ లో మరో ఆఫర్ పడింది. 

తమిళనాట స్వయంకృషితో ఎదిగిన హీరోగా శివకార్తికేయన్ కు మంచి పేరుంది. మనోడు చిన్న హీరోగా మొదలై.. తక్కువ టైమ్ లోనే మీడియం రేంజ్ హీరోగా ఎదిగాడు. అతనికి ప్రామినెంట్ మార్కెట్ కూడా ఉంది అక్కడ. శివకార్తికేయన్ 14వ సినిమాగా వస్తోన్న ఈ మూవీకి ఆర్ రవికుమార్ దర్శకుడు. ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారు. ఇవాళే తను ఆ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయింది. అంటే ఇప్పుడు రకుల్ చేతిలో మూడు తమిళ సినిమాలున్నాయి. ఓ హిందీ మూవీ ఉంది. బట్ ఎటొచ్చీ తను ఎదిగిన తెలుగులోనే ఎవరూ పట్టించుకోవడం లేదు. కాకపోతే రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తోన్న సినిమాలో రకుల్ ఓ ఐటమ్ సాంగ్ చేయబోతోందనే రూమర్స్ మాత్రం బాగా వినిపిస్తున్నాయి. ఏమైతేనేం.. అమ్మడు అక్కడ బిజీ అయిపోతోంది కాబట్టి.. ఇక అక్కడే సెటిల్ అవుతుందేమో.. 

More Related Stories