English   

రకుల్ పెళ్లికి మహేష్ బాబు సాయం 

rakulpreethsingh mahesh babu
2018-07-18 19:46:14

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆఫర్ రావడమే ఆనందంగా ఫీలవుతారు హీరోయిన్లు. దీనివల్ల మహేష్ తో రొమాన్స్ చేయాలన్న కల తీరడంతో పాటు ఒకేసారి స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయిపోయే చాన్స్ కూడా వస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ ఛాన్స్ మిస్ ఫైర్ అవుతుంది. స్పైడర్ లాగా. అలా మిస్ ఫైర్ అయిన జోడీకి మళ్లీ ఛాన్స్ వస్తే.. యస్.. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి మహేష్ బాబుతో రొమాన్స్ కు రెడీ అవుతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి స్పైడర్ సినిమాలో నటించారు. ఇద్దరికీ ఆ సినిమా చేదు అనుభవాల్నిచ్చింది.  అయితే ఈ సినిమా చేస్తోన్న టైమ్ లోనే మహేష్ ఈ భామకు మరో ఛాన్స్ ఇస్తా అని చెప్పాడట. ఆ మేరకు తన నెక్ట్స్ సినిమాలో మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతోందనే వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. 

నిజానికి మహేష్ బాబుతో నటించడం తన డ్రీమ్ అని గతంలో చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. అంతే కాదు.. అతనితో నటించిన తర్వాత పెళ్లి చేసుకుంటానని కూడా వేళాకోలమాడింది. అలా కొన్ని రోజులకే అమ్మడికి మహేష్ తో ఆఫర్ వచ్చింది. బట్ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో సైలెట్ అయిపోయింది. మరి రకుల్ పెళ్లి కావాలంటే మహేష్ తో ఓ మంచి హిట్ కొట్టాలి కదా. అందుకే అమ్మడి కోసం ఈ సూపర్ స్టార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్నాడట.. 

ప్రస్తుతం కెరీర్ లో 25వ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ తర్వాత సుకుమార్ తో సినిమాకు సిద్ధంగా ఉన్నాడు. సో.. రంగస్థలం తర్వాత మంచి డిమాండ్ లో ఉన్న సుకుమార్ తో 26వ సినిమా చేస్తున్నాడనేది ఎప్పుడో తెలిసిందే. ఈ సినిమాలోనే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇక రకుల్ తో సుకుమార్ కూడా గతంలో నాన్నకు ప్రేమతో సినిమా చేసి ఉన్నాడు. సో.. ఈ ముగ్గురికీ మంచి అండర్ స్టాండింగ్ కూడా ఉండే అవకాశం ఉంది.. సో.. ఏదైనా జరగొచ్చు.. రకుల్ పెళ్లికి మహేష్ మళ్లీ హెల్ప్ చేయొచ్చు..
 

More Related Stories