English   

శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ కష్టమేనా..?

rakul preeth singh
2018-07-21 18:23:39

టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఎన్టీఆర్’. దివంగత నటుడు, ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బయోపిక్ గా వస్తోన్న సినిమా ఇది. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీలో ప్రధాన తారాగణం ఎంపిక్ దాదాపు పూర్తయినట్టే. అయితే సిట్యుయేషన్స్ కు తగ్గట్టుగా వచ్చే ఆర్టిస్టులను టైమ్ ను బట్టి సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్ షూటింగ్ లోజాయిన్ అయింది. ఇక ఎన్టీఆర్ కెరీర్ కు బిగ్గెస్ట్ టర్న్ ఇచ్చిన సినిమా అడవి రాముడు.. ఆతర్వాత వేటగాడు. ఈ సినిమాలో శ్రీదేవితో ఆయన రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందుకే శ్రీదేవి పాత్రకు ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలనుకుంటోంది టీమ్. ఇందుకు రకుల్ కూడా ఓకే.. కానీ చిన్న ప్రాబ్లమ్ వచ్చింది.. 

శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని టీమ్ అనుకోవడం.. అందుకు తను సానుకూలంగా ఉండటం వరకూ ఓకే. అయితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ వల్ల తనకు శ్రీదేవిగా మారే అవకాశాలు తగ్గుతున్నాయి అని వినిపిస్తోంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తమిళ్ లో రెండు సినిమాలు చేస్తోంది. తెలుగులో, బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్ తో మరో రెండు సినిమాలు. ఈ నాలుగు సినిమాల డేట్స్ ను అడ్జెస్ట్ చేసుకుంటే కానీ ఎన్టీఆర్ లో శ్రీదేవి అయ్యే చాన్స్ లేదట. కానీ ఇలాంటి ఛాన్స్ అందరికీ రాదు. పైగా ఇది అరుదైన అవకాశం. అందుకే తన డేట్స్ అడ్జెస్ట్ చేసుకునే పనిలో ఉందట. మరి ఆయా సినిమాల దర్శక, నిర్మాతలు ఇందుకు ఒప్పుకుంటే రకుల్ .. శ్రీదేవిలా కనిపిస్తుంది.. లేదంటే ఆ ఛాన్స్ మరొకరికి పోతుంది.. 

More Related Stories