English   

 ఎన్టీఆర్ కోసం వాళ్లెందుకు..? 

NTR-biopic
2018-07-17 12:24:06

మ‌హాన‌టి త‌ర్వాత ఏ బ‌యోపిక్ వ‌చ్చినా కూడా ఆస‌క్తిగానే చూస్తున్నారు ప్రేక్ష‌కులు. ఎందుకంటే బ‌యోపిక్ అంటే జీవితం క‌దా.. ప‌క్క వాళ్ల జీవితం గురించి తెలుసుకోడానికి ఎప్పుడూ ఆస‌క్తి ఉంటుంది. పైగా వాళ్లు లెజెండ్స్ అయితే అంత‌కంటే కావాల్సిందేం ఉంది. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇప్ప‌టికే తెలుగులో సావిత్రి బ‌యోపిక్ వ‌చ్చింది.. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ రెడీ అవుతుంది. ఇందులో ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నార‌నే విష‌యంపై ఇంకా చ‌ర్చలు న‌డుస్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే విద్యాబాల‌న్ ను బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో తీసుకున్నాడు క్రిష్. ఈ పాత్ర‌లో త‌న‌కు ఏదో తెలియ‌ని ఆస‌క్తి క‌నిపించింద‌ని చెబుతుంది విద్యాబాల‌న్. అందుకే క్రిష్ క‌థ చెప్ప‌గానే ఒప్పుకున్నానంటుంది విద్య‌. 

ఇక ఇదే సినిమాలో సావిత్రి పాత్ర కోసం మ‌రోసారి కీర్తిసురేష్ నే తీసుకుంటున్నారు. ముందు నో అన్నా.. బాల‌య్యే అడిగేస‌రికి కీర్తి నో అన‌లేక‌పోయింద‌ని తెలుస్తుంది. దానికితోడు ర‌కుల్ కూడా ఈ చిత్రంలో న‌టించ‌బోతుంది. అయితే ఈమెను ఏ పాత్ర కోసం తీసుకుంటున్నార‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఈమెతో పాటు ఇందులో మ‌రికొంద‌రు హీరోయిన్లు కూడా న‌టించ‌బోతున్నారు. ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లైంది. అయితే వాళ్లంద‌రి పాత్ర‌ల‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సంక్రాంతికి ఎన్టీఆర్ బ‌యోపిక్ విడుద‌ల కానుంది. బాల‌య్యే ఈ చిత్రాన్ని విష్ణుఇందూరి, సాయి కొర్ర‌పాటితో క‌లిసి నిర్మిస్తున్నాడు. 

More Related Stories