English   

చ‌ర‌ణ్-బోయ‌పాటి.. శాటిలైట్ ఓ బాంబ్..

ram charan and boyapati sreenu

మాస్ ఇమేజ్ ఒక్క‌సారి వ‌స్తే ఎంత యూజ్ అవుతుందో ఇప్పుడు చ‌ర‌ణ్ సినిమాల‌ను చూస్తే అర్థ‌మైపోతుంది. ఆయ‌న‌కు బోయ‌పాటి శీను లాంటి మాస్ డైరెక్టర్ తోడైతే ఇక ర‌చ్చ ర‌చ్చే. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియ‌కుండానే శాటిలైట్ రైట్స్ ను రికార్డ్ రేట్ కు తీసుకున్నారు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 22 కోట్లు పెట్టి బోయపాటి-చ‌ర‌ణ్ సినిమా రైట్స్ తీసుకుంది ఓ ప్ర‌ముఖ ఛానెల్. ఓ ర‌కంగా ఇది రికార్డ్. ప‌వ‌న్, మ‌హేశ్ సినిమాల‌కు త‌ప్ప ఇంత రేట్ రావ‌డం చిన్న విష‌యం కాదు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. మార్చ్ 30 వ‌ర‌కు బోయ‌పాటి సినిమాపై దృష్టి పెట్ట‌డం క‌ష్ట‌మే.

ఈ చిత్రం రాజస్ధాన్ బ్యాక్ డ్రాప్ లో ఉప‌డ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. రెండో షెడ్యూల్ అక్క‌డే ప్లాన్ చేస్తున్నాడు బోయ‌పాటి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కైరాఅద్వాని హీరోయిన్ గా న‌టిస్తుంది. చ‌ర‌ణ్ లుక్ పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడు బోయ‌పాటి. ఇప్ప‌టికే ఓ కొత్త లుక్ ట్రై చేసాడు చ‌ర‌ణ్. ఈ మ‌ధ్యే ఆ లుక్ కూడా బ‌య‌టికి వ‌చ్చింది. రంగ‌స్థ‌లం కోసం పెంచిన గ‌డ్డంలా కాకుండా మ‌రోలా గ‌డ్డాన్ని మార్చేసాడు చ‌ర‌ణ్. దానికి తోడు ఒంటిపై టాటూస్ కూడా క‌నిపించ‌బోతున్నాయి. ఎనిమిది నెల‌ల్లో షూటింగ్ పూర్తిచేసి.. ద‌స‌రాకు సినిమా విడుద‌ల చేయ‌నున్నాడు బోయ‌పాటి శీను. డివివి దాన‌య్య నిర్మాత‌. నాయ‌క్, బ్రూస్లీ సినిమాల‌ త‌ర్వాత ఆయ‌న నిర్మాణంలో చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా ఇది.

More Related Stories