English   

ప్ర‌భాస్ బాట‌లో చ‌ర‌ణ్, ఎన్టీఆర్..

Jrntr,prabhas and ram charan
2018-03-05 18:24:53

అవునా.. ఏ విష‌యంలో ప్ర‌భాస్ ను ఈ హీరోలు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారా..? ఈ ఇద్ద‌రు హీరోల‌తో రాజ‌మౌళి ఓ సినిమా చేయ‌బోతు న్నాడు. ఈ విష‌యం తెలిసిందే. దాన‌య్య నిర్మాత‌. ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధ‌మైపోయింది. అక్టోబ‌ర్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ముందు నుంచి ఈ చిత్రంపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది ఎలా ఉండ‌బోతుంది..? క‌థేంటి..? గ‌్రాఫిక్స్ తో ఉన్న సినిమానా లేని సినిమానా.. ఇలా ఎన్నో అనుమానాలు ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్నాయి. ఓ వైపు రాజ‌మౌళి మాత్రం త‌ను ఏ మాత్రం గ్రాఫిక్స్ లేని సినిమానే చేస్తున్నాన‌ని చెప్పాడు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అలా అనిపించ‌ట్లేదు. ఇది కూడా ప‌క్కా విజువ‌ల్ వండ‌ర్ గానే తెర‌కెక్క‌బోతుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రానికి బాహుబ‌లి రేంజ్ కాదు కానీ.. ఈగ‌ను మించిన గ్రాఫిక్స్ వాడుకుంటున్నాడు రాజ‌మౌళి. ప్రేక్ష‌కుల‌కు అయితే విజువ‌ల్ ఎఫెక్ట్స్ లేని సినిమా అని చెప్పినా క‌చ్చితంగా ఇది కూడా గ్రాఫికల్ మూవీగానే వ‌స్తుంది.

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం మారిపోతున్నారు. ఫిజిక్ విష‌యంలో కానీ అన్నింట్లోనూ రాజ‌మౌళి ఎలా చెబితే అలా మార‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక ప్ర‌భాస్ ను ఫాలో కావ‌డం అంటారా.. ఎక్క‌డ అంటే బాహుబ‌లి మొద‌ల‌వ్వ‌క ముందు ఈ చిత్రం ఇంత పెద్ద సంచ‌ల‌నాలు సృష్టిస్తుంద‌ని రాజ‌మౌళి కూడా అనుకోలేదు. ఆ సినిమా టైమ్ లో ప్ర‌భాస్ గుర్ర‌పుస్వారీతో పాటు అన్ని యుద్ధ‌విద్య‌లు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ మ‌ల్టీస్టార‌ర్ రేంజ్ కూడా అదే అనిపిస్తుంది. ముందు నుంచి భారీ అంచ‌నాలున్నా బాహుబ‌లి రేంజ్ అయితే కాదు క‌దా అని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ మ‌ల్టీస్టార‌ర్ ను కూడా అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు రాజ‌మౌళి. మ‌రో విష‌యం కూడా ఇక్క‌డ చెప్పుకోవాలి.. 2018 అక్టోబ‌ర్ లో మొద‌ల‌య్యే ఈ చిత్రం 2019లో రాక‌పోవ‌చ్చు. విజ‌న్ 2020 ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. క‌చ్చితంగా ఏడాదిన్న‌ర పాటు సెట్స్ పైనే ఉంటుంది ఈ చిత్రం. దాంతో రెండేళ్లు పూర్తిగా రాజ‌మౌళికి రాసివ్వ‌డానికి రెడీ అయిపోయారు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్. మ‌రి చూడాలిక‌.. ఈ విజువ‌ల్ వండ‌ర్ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories