English   

కైరాను క‌ష్ట‌పెడుతున్న చ‌ర‌ణ్.. 

Kiara-Advani
2018-05-21 16:08:50

అవును.. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటే సినిమా కూడా అంత అందంగా వ‌స్తుందంటారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, కైరా అద్వానీ ఇదే చేస్తున్నారు. అయితే వీళ్ల మ‌ధ్య కెమిస్ట్రీ కాదు.. చూస్తుంటే ఫిజిక్స్, బ‌యాల‌జీ అన్నీ బాగానే కుదిరిన‌ట్లున్నాయి. జిమ్ లో ఇద్ద‌రూ క‌ష్ట‌ప‌డుతున్న వీడియో ఒక‌టి విడుద‌లైంది. ఇప్పుడు ఇద్ద‌రూ బోయ‌పాటి సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర మూడో షెడ్యూల్ జ‌రుగుతుంది. ఈ మ‌ధ్యే బ్యాంకాక్ వెళ్లి అక్క‌డే షూటింగ్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి. ఇదిలా ఉంటే ఇద్ద‌రూ జిమ్ లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న వీడియో రిలీజైంది. ఇందులో చ‌ర‌ణ్ ఎక్కువ‌గా కైరాను ఆట ప‌ట్టిస్తున్నాడు. త‌న‌కు వ‌చ్చిన ఫీట్స్ అన్నీ చేస్తూ కైరాను ఇబ్బంది పెడుతున్నాడు. చ‌ర‌ణ్ జోరు ముందు అలా చూస్తుండిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. చివ‌రికి చ‌ర‌ణ్ తో పోటీ ప‌డ‌లేక న‌వ్వేసి పోటీ నుంచి త‌ప్పుకుంది కైరా. ఈ మ‌ధ్యే భ‌ర‌త్ అనే నేనుతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చ‌ర‌ణ్ సినిమాతో స్టార్ అవ్వాల‌ని చూస్తుంది. బోయ‌పాటి సినిమా హిట్టైతే తెలుగు ఇండ‌స్ట్రీలో కైరా పేజీ ఓపెన్ అయిన‌ట్లే..! ఈ ఏడాది చివ‌ర్లో బోయ‌పాటి సినిమా విడుద‌ల కానుంది. 

More Related Stories