English   

రామ్ చరణ్ మరో ‘ధృవ’ చేస్తున్నాడా..?

Ram-Charan-As-Cop
2018-08-18 16:31:41

మెగా పవర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ధృవ. రంగస్థలంతో నటుడుగా ప్రూవ్ చేసుకోవడమే కాదు.. బాక్సాఫీస్ నూ షేక్ చేశాడు. అయితేఈ రెండు కాస్త క్లాస్ టచ్ తో సాగే సినిమాలు. అందుకే కొంత గ్యాప్ తర్వాత ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీలో భరత్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీకి సంబంధించి వినిపిస్తోన్న ఓ కొత్త వార్త ఏంటంటే.. చరణ్ మరోసారి ధృవ చేస్తున్నాడా అని..? అంటే అదే పాత్ర కాదు కానీ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి బోయపాటి సినిమా వర్గాలు.. '

బోయపాటి శ్రీను హీరోలు అసలే ఊరమాస్ గా ఉంటారు. దేన్నీ లెక్క చేయని తత్వంతో ఉంటారు. అలాంటి ఆ హీరో పోలీస్ అయితే ఇంక చెప్పేదేముందీ.. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ పవర్ ఫుల్ కాప్ గా నటిస్తున్నాడనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిని ఆ మూవీ టీమ్ నుంచి ఎవరూ ఖండించకపోవడంతో ఆ వార్త నిజమే అన్నట్టుగా అయింది. మొత్తంగా ధృవలో యువ ఐపిఎస్ ఆఫీసర్ గా క్లాస్ గా దుమ్మురేపిన రామ్ చరణ్ ఈ సారి బోయపాటి పోలీస్ ఆఫీసర్ గా మక్కెలు విరగ్గొడతాన్నమాట.. మరి ఈ పాత్రను బోయపాటి ఎలా డిజైన్ చేశాడో కానీ.. చెర్రీ ఫ్యాన్స్ కు మాత్రం ఈ న్యూస్ డబుల్ కిక్ ఇస్తుందనే చెప్పాలి. 

More Related Stories