English   

 బాబాయ్ రికార్డ్ కొట్టిన అబ్బాయి..

Ram-charan-Pawan

ఐదేళ్లైంది.. ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.. చిరంజీవి కూడా వ‌చ్చెళ్లాడు.. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సృష్టించిన రికార్డు ద‌రిదాపుల్లో క‌నిపించ‌లేదు. బాహుబ‌లి ప‌క్క‌న‌బెడితే మ‌రే సినిమా కూడా ప‌వ‌ర్ స్టార్ ను ట‌చ్ చేయ‌లేక‌పోయారు. అదే అత్తారింటికి దారేది నైజాం రికార్డ్. ఈ చిత్రం ఐదేళ్ల కిందే తెలంగాణ‌లో 23 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా అది చేరుకోలేదు. ఖైదీ నెం.150 సైతం 20 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. కానీ ఇప్పుడు అబ్బాయి వ‌చ్చాడు.. రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం 24 కోట్ల మార్క్ అందుకుని స‌రికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే 25 కోట్ల మార్క్ అందుకునేలాగే క‌నిపిస్తుంది. నైజాంలో ఇప్ప‌టికే మ‌గ‌ధీర‌తో 22 కోట్ల మార్క్ అందుకున్న చ‌ర‌ణ్.. ఇప్పుడు రంగ‌స్థ‌లంతో దాన్ని మించిపోయాడు. మూడో వారాంతంలో కూడా 6 కోట్ల షేర్ వ‌సూలు చేసింది రంగ‌స్థ‌లం. ఒక్క నైజాంలోనే 2.50 కోట్ల షేర్ వ‌చ్చింది. మొత్తానికి ఇన్నేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ రికార్డ్ కాస్త ప‌క్క‌కు జ‌రిగింద‌న్న‌మాట‌. అది కూడా అబ్బాయి సినిమా తోనే..!

More Related Stories