English   

రామ్ చరణ్ ‘బ్యాంకాక్ మెమరీస్’ 

Ram-charan
2018-05-09 16:05:02

రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ బోయపాటి శ్రీనుతో సినిమాకు సిద్ధమయ్యాడు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళుతోంది. ఈ నెల 10నుంచి బ్యాంకాక్ లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరిస్తారని టాక్. భరత్ అనేనేనుతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ హీరోయిన గా నటిస్తోంది. ఈ మూవీలో ఈ షెడ్యూల్ కైరా కూడా జాయిన్ అవుతుంది. అయితే బ్యాంకాక్ అంటే చరణ్ కు చాలా మెమరీసే ఉన్నాయి. తన మొదటి సినిమా చిరుత కోసం బ్యాంకాక్ లో చాలా రోజులు ఉన్నారు. చిరుత సినిమా తన కెరీర్ లో ఫస్ట్ మూవీ అయినా డెబ్యూ మూవీగా బెస్ట్ మెమరీస్ నే ఇచ్చింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత బ్యాంకాక్ లో ఓ షెడ్యూల్ మొత్తం షూటింగ్ చేసుకోబోతుండటం చరణ్ ను ఎగ్జైట్ చేస్తుందట. 

ఇక ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరిస్తామని చెబుతున్నారు కాబట్టి.. ఈసందర్భంగా చిరుతకు సంబంధించిన ఫైట్స్ కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా హీరోయిన్ నేహా శర్మను విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసినప్పుడు చరణ్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సూపర్బ్. ముఖ్యంగా చరణ్ మూమెంట్స్ కు అప్పట్లో మెగా ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. అలాగే హీరోయిన్ తో మోస్ట్ రొమాంటిక్ సీన్స్ అన్నీ బ్యాంకాక్ లోనే చిత్రీకరించడాడు అప్పటి దర్శకుడు పూరీ జగన్నాథ్.  నిజానికి బ్యాంకాక్ ఎపిసోడ్ చూసే చాలామంది చిరుకు సరైన వారసుడు అనుకున్నారు. అలాంటి చరణ్ ఈ పదేళ్లలో ఎంత మెచ్యూర్డ్ గా మారిపోయాడో తెలుసు. లేటెస్ట్ గా రంగస్థలంతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. 

ఇక యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించడంలో మాస్టర్ అనిపించుకున్న బోయపాటి శ్రీనుతో ఫస్ట్ టైమ్ సినిమా చేస్తున్నాడు చరణ్. మరి చరణ్ లాంటి మాస్ హీరో దొరికితే బోయపాటి ఊరుకుంటాడా.. చిరుతను మించిన భారీ యాక్షన్ ప్లాన్ చేసుకుంటాడు. మొత్తంగా బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీలో చరణ్ మరోసారి బ్యాంకాక్ బెస్ట్ చూపిస్తాడేమో చూడాలి. 

More Related Stories