English   

చ‌ర‌ణ్ కాట‌మ‌రాయుడు సీక్వెల్ చేస్తున్నాడా..?

Ram-charan
2018-04-06 16:45:09

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లంతో జూలు విదిల్చాడు. ఇన్నాళ్లూ బాక్సాఫీస్ వార్ లో కాస్త వెన‌క‌బ‌డ్డ ఈ మ‌గ‌ధీరుడు.. రంగ‌స్థ‌లంలో ర‌ఫ్ఫాడిస్తున్నాడు. ఒక ర‌కంగా క‌లెక్ష‌న్ల సునామీ క్రియేట్ చేశాడ‌నుకోవ‌చ్చు. ఇప్ప‌టికే నాన్ బాహుబ‌లి రికార్డ్స్ అన్నీ ఇక రంగ‌స్థ‌లానివే అని ఎంటైర్ టాలీవుడ్ ఫిక్స్ అయిపోయింది. ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ ఎంజాయ్ చేస్తూనే ఇప్పుడు చ‌ర‌ణ్ నెక్ట్స్ సినిమాకు ప్రిపేర్ అవుతున్నాడు. అది మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి డైరెక్ష‌న్ లో. అయితే ఈ సినిమాకు సంబంధించిన వినిపిస్తోన్న కొన్ని వార్త‌లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇది కూడా ఓ మినీ మ‌ల్టీస్టార‌ర్ లాంటిదే. అయితే ఆల్రెడీ ఎన్టీఆర్ తో క‌లిసి రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో ఓ మెగా మల్టీస్టార‌ర్ కు ఓకే చెప్పి ఉన్న చ‌ర‌ణ్‌.. ఇప్పుడు బోయ‌పాటితో కూడా దాదాపు అలాంటి సినిమానే చేయ‌బోతుండ‌టం విశేషం. అయితే దీన్ని మ‌ల్టీస్టార‌ర్ అనే కంటే కాట‌మ‌రాయుడుకు క‌జ‌జిన్ లాంటి సినిమా అనుకోవ‌చ్చు. 


బోయ‌పాటి డైరెక్ష‌న్ లో చ‌ర‌ణ్ చేయ‌బోతోన్న సినిమాలో భారీ తారాగ‌ణం ఉంది. అత‌నికి సోద‌రులుగా తెలుగు నుంచి న‌వీన్ చంద్ర‌, ఆర్య‌న్ రాజేశ్ న‌టిస్తున‌నారు. అలాగే తొలిముద్దు, జీన్స్ సినిమాల ఫేమ్ ప్ర‌శాంత్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. వీళ్లంతా ఇక్క‌డి వారే అయితే.. అత‌ని విల‌న్స్ మాత్రం బాలీవుడ్ స్టార్స్. ముఖ్యంగా ర‌క్త చ‌రిత్ర‌లో ప‌రిటాల ర‌విగా తెలుగువారిని ఆక‌ట్టుకున్న వివేక్ ఒబెరాయ్ మెయిన్ విల‌న్ గా న‌టిస్తోంటే, మ‌హేష్ మంజ్రేక‌ర్ మ‌రో విల‌న్ గా న‌టిస్తున్నాడు. త‌న‌కు తెలియ‌కుండా త‌న బ్ర‌ద‌ర్స్ విల‌న్ తో వైరం పెట్టుకోవ‌డం.. ఓ కీల‌క‌మైన స‌మ‌యంలో ఆ విష‌యం తెలుసుకున్న మ‌న మినీ కాట‌మ‌రాయుడు విల‌న్స్ తో త‌ల‌ప‌డ‌టం.. ప్ర‌స్తుతానికి వినిపిస్తోన్న ఈ సినిమా పాయింట్ ఇదే. అయితే పాయింట్ ఏదైనా త‌న‌దైన ఎమోష‌న్స్ అండ్ మాసివ్ సీన్స్ తో హైలెట్ చేయ‌డం బోయ‌పాటి స్టైల్. మ‌రి ఆస్టైల్ రామ్ చ‌ర‌ణ్ విష‌యంలో ఎలా వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి. 

More Related Stories