English   

ఆచార్య ను పూర్తి చేసుకున్న సిద్ధ

 Ram Charan
2021-03-05 16:07:01

మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ మెగాస్టార్ ఇప్పటివరకు రెండు మూడు సినిమాల్లో కలిసి స్క్రీన్ పై అలరించినా ఫుల్ లెన్త్ రోల్ మాత్రం చేయలేదు. అయితే ఈ సినిమాలో మాత్రం రామ్ చరణ్ దాదాపు ముప్పై నిమిషాల పాటు కనిపించబోతున్నట్టు దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతే కాకుండా సినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో అలరించనున్నట్టు పేర్కొన్నాడు. 

ఇక సినిమా నుండి రామ్ చరణ్ ప్రీ లుక్ ను అప్పట్లో రిలీజ్ చేయగా...ఇటీవల మరో ఫోటోను విడుదల చేసారు. ఈ ఫొటోలో చరణ్ తుపాకీ వాయువు చూస్తుండగా భుజం పై ఒక చెయ్యి వేసి అదుపు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా...చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా చరణ్ తన 20 రోజుల షూటింగ్ షెడ్యూల్ ను ఈరోజు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య యూనిట్ ఆయనకు ఎంతో ఘనంగా సెండ్ ఆఫ్ ఇచ్చింది.

More Related Stories