English   

రామ్ చ‌ర‌ణ్ ఓటేయ‌లేదు తెలుసా..? 

Ram-Charan
2018-12-07 19:50:05

పోలింగ్ డే రోజు ఓటర్ల‌తో బూత్ ల‌న్నీ క‌ళ‌క‌ళ‌లాడిపోయాయి. ఊహించినంత ఓటింగ్ శాతం న‌మోదు కాక‌పోయినా కూడా బాగానే వ‌చ్చార‌ని పార్టీలు ఖుషీ అవుతున్నాయి. అయితే సెలెబ్రెటీస్ మాత్రం దాదాపు అంతా వ‌చ్చారు. వ‌చ్చి ఇక్క‌డే తమ ఓట్ హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే ఎంత‌మంది వ‌చ్చినా కూడా రామ్ చ‌ర‌ణ్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దాంతో ఆయ‌న ఎక్క‌డున్నాడో అనే వాద‌న కూడా మొద‌లైంది. మెగా కుటుంబం నుంచి అంతా వ‌చ్చి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, సురేఖ దంప‌తులు పొద్దున్నే వ‌స్తే.. నాగ‌బాబు మ‌ధ్యాహ్నం త‌ర్వాత కుటుంబంతో క‌లిసి వ‌చ్చి ఒటేసాడు. ఇక సాయిధ‌ర‌మ్ తేజ్, బ‌న్నీ లాంటి వాళ్లు కూడా ఓటేయ‌డ‌మే కాకుండా ఓటేయాలంటూ అంద‌రికీ విజ్ఞ‌ప్తి కూడా చేసారు. కానీ ఆ కుటుంబం నుంచి రామ్ చ‌ర‌ణ్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. 

దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు రామ్ చ‌ర‌ణ్. ఈ సారి తాను ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నానని రామ్‌చరణ్ ఆవేద‌న చెందాడు. కొన్ని కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నా. దయచేసి అందరూ ఓటు వేయండి.. అందులో నా ఓటు కూడా ఉంద‌ని సంతోషిస్తా అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఈయ‌న ఓటు వేయక‌పోవ‌డానికి కార‌ణం మాల‌లో ఉండ‌టం.. ఆయ‌న శ‌బ‌రిమ‌లైకు వెళ్లాల్సి రావ‌డ‌మే అని తెలుస్తుంది. అదేం కాదు.. విన‌య విధేయ రామ షూటింగ్ లో ఉన్నాడు అందుకే రాలేదు అని మ‌రికొంద‌రు చెబుతున్నారు. బోయ‌పాటి శీను కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇదే నిజం అయి ఉంటుంద‌ని అనుకుంటున్నారంతా. కార‌ణ‌మేదైనా ఈ సారి ఓటు వేయ‌లేక‌పోయాడు చ‌ర‌ణ్. దీనికి చాలా బాధ ప‌డుతున్నాడు కూడా.

 

More Related Stories