English   

రామ్ చరణ్ రఫ్ఫాడిస్తున్నాడు

ram charan
2018-02-28 12:34:40

ఏ స్టార్ హీరో అయినా కథకు సరెండర్ అయితే.. ఆ కథ ఆడియన్స్ ను ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఇమేజ్ గోడలను పక్కనబెట్టి.. దర్శకుడి వ్యూ కు ఊఁ కొడితే చాలు.. వాఁ అనేస్తారు ప్రేక్షకులు.  ధృవ నుంచి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇదే చేస్తున్నాడు. ఇమేజ్ ను పక్కనబెట్టి కథకు సరెండ్ అయిపోతున్నారు. ఇక తన కెరీర్ లోనే ది బెస్ట్ గా చెప్పుకునేలా రంగస్థలం కథకు ఓకే చెప్పి ఎంటైర్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేశాడు రామ్ చరణ్. రంగస్థలం 1985ల నాటి కథాంశం. ఆ కాలాన్ని ప్రేక్షకుల ముందుంచాలి. నటనలోనూ అది కనిపించాలి. అంటే చరణ్ కు సవాల్ లాంటి పాత్ర. అంతకంటే పెద్ద సవాల్.. తన ఇమేజ్ ను పూర్తిగా పక్కన బెట్టి చరణ్ ఇందులో చెవిటి వ్యక్తిగా కనపించబోతున్నాడు. దీంతో అంతా చరణ్ కు హ్యాట్సాఫ్ అనేస్తున్నారు.

ఇక రామ్ చరణ్, సుకుమార్, సమంతలు కలసి ఫస్ట్ టైమ్ పనిచేస్తున్నారు. అందువల్ల ఇది మోస్ట్ క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ గానూ చెప్పుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే.. చరణ్ చెవిటి వ్యక్తిగా నటిస్తోంటే సమంత మూగ అమ్మాయిగా కనిపించబోతోంది. చూస్తోంటే ప్రయోగాత్మకంగానూ కనిస్తోన్న కమర్షియల్ గా ఏమాత్రం డిజప్పాయింట్ చేయని పాయింట్ తో తెరకెక్కిస్తున్నాడు సుక్కూ. అయితే ఈ మొత్తం క్రేజ్ ను డబుల్, త్రిబుల్ చేసేలా వేలైంటైన్స్ డే కు వచ్చిన సాంగ్ తో ఒక్కసారిగా గేమ్ చేంజ్ చేసింది టీమ్. ఎంత సక్కగున్నవే లచ్చిమి అంటూ సాగే ఈ పాట నచ్చని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. అచ్చమైన పల్లె నుడికారంతో చంద్రబోస్ రాసిన ఈ పాటను తన ట్యూన్ అండ్ టోన్ తో ప్రాణం పోశాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్. ఇలాంటి పాట చూసి మనకూ చాలాకాలం అయింది. అందుకే ఇది యూ ట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. చాలా మ్యూజిక్ యాప్స్ లోనూ ఇదే టాప్ సాంగ్.. ఇప్పటికే 10మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న లచ్చిమి పాట లైక్స్ లోనూ రికార్డ్ కొట్టేసింది. దాదాపు రెండులక్షల లైక్స్ వచ్చాయీ పాటకు. ఏదేమైనా ఈ పాట కోసమే సినిమా చూడాలనుకునేవారూ ఉన్నారు. మొత్తంగా ఈ మూవీ ఏ మ్యాజిక్ చేస్తుందో కానీ.. ఆడియన్స్ మాత్రం రంగస్థలం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.మొత్తానికి ఒక్క పాటతోనే చరణ్ రఫ్ఫాడిస్తున్నాడు.

More Related Stories