English   

బ‌న్నీ గెస్ట్ గా చ‌ర‌ణ్‌

Naa-Peru-Surya

ఒకే ఫ్యామిలీకి సంబంధించిన హీరోలంతా ఒకే వేదిక‌పై కనిపిస్తే అభిమానుల‌కు ఆ కిక్కే వేరు. రీసెంట్ గా రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ్లాడు. ఫ్యాన్స్ లో ఖుషీ నింపాడు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ఆ ప‌నిచేయ‌బోతున్నాడు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా చ‌ర‌ణ్ వెళ్ల‌బోతున్నాడు. ఈ ఫంక్షన్ ఈ నెల 29న హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌బోతోంది. వెన్యూ ఇంకా ఫైన‌ల్ కాలేదు. అల్లు అర్జున్, అనూ ఇమ్మానుయేల్ జంట‌గా వ‌స్తోన్న ఈ సినిమాకు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడు. రీసెంట్ గా మిల‌ట్రీ మాధ‌వ‌రంలో ఆడియో విడుద‌ల చేసిన టీమ్.. ఈ సారి తెలంగాణ ఫ్యాన్స్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కూ నా పేరు సూర్య ప్ర‌మోష‌న్స్ పెద్ద‌గా కిక్ ఇవ్వ‌లేదు. చాలా రోజులుగా కామ్ గా నేఉంది టీమ్. అందుకు కార‌ణం రంగ‌స్థ‌లం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది కాబ‌ట్టి.. ఆ మూవీ క‌లెక్ష‌న్స్ ను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని.. బ‌న్నీయే ఇలా ప్ర‌మోష‌న్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాడ‌ట‌. ఇప్పుడు రంగ‌స్థ‌లం ఆల్ టైమ్ హిట్ గా డిక్లేర్ అయింది కాబ‌ట్టి.. ఇక బన్నీ మొద‌లుపెట్టాడు. ఆడియో త‌ర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈ మ‌ధ్య‌లో ఓవ‌ర్శీస్ లో కూడా కొన్ని ప్ర‌మోష‌నల్ ఈవెంట్స్ అనుకుంటున్నార‌ని టాక్. మొత్తంగా ఈ ఫంక్ష‌న్ త‌ర్వాత సినిమా విడుద‌ల‌కు చాలా త‌క్కువ టైమే ఉంటుంది. సో.. ఇక కంటిన్యూస్ గా ప్ర‌మోష‌న్స్ చేస్తారేమో..

More Related Stories