English   

అర్రె.. సుకుమార్, రామ్ చరణ్ మాట విని ఉంటేనా..?

Ram-Charan-Tej
2018-02-15 11:46:15

ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే డిస్కషన్ నడుస్తోంది. సుకుమార్ కానీ రామ్ చరణ్ మాట విని ఉంటేనా అని. అందుకు కారణం ఏంటో తెలుసా.. రంగస్థలం సినిమాకు సంబంధించి ప్రమోషనల్ వర్క్స్ లో రామ్ చరణ్ కాస్త ఎక్కువ ఇన్సియేషన్ తీసుకుంటున్నాడట. సుకుమార్ క్రియేటివ్ ఐడియాస్ కూడా ఆశ్చర్యపోయేలా కొన్ని ప్లానింగ్స్ చేస్తున్నాడట. మొన్నటికి మొన్న సమంత టీజర్ సుకుమార్ మరోలా ప్లాన్ చేశాడు. కానీ చరణ్ మాత్రం తన వాయిస్ ఓవర్ తో టీజర్ చేద్దాం అన్నాడట. ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు సుక్కు. కట్ చేస్తే ఈ టీజర్ కు చరణ్ వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణగా నిలిచిందని వేరే చెప్కక్కర్లేదు. 

లేటెస్ట్ గా ఎంత సక్కగున్నావే పాట విషయంలో కూడా చరణ్ ఓ సూపర్ ఐడియా ఇచ్చాడట. కానీ సుక్కు ఒప్పుకోలేదు. ఒప్పుకుని ఉంటే ఆడియన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ అయ్యుండేది. ఇంతకీ అదేంటంటే.. ఈ పాటకు సంబంధించి రెండు నిమిషాల వీడియోను కూడా విడుదల చేద్దాం అని చెప్పాడట చరణ్. కానీ సుకుమార్ వినలేదు. ఈ పాటకు సంబంధించి ఇంకా డిజిటల్ వర్క్ పూర్తి కాలేదనీ.. కాబట్టి విడుదల చేయడం కుదరదని తేల్చేశాడట సుకుమార్. ఈ విషయంలో చరణ్ కాస్త డిజప్పాయింట్ అయినా.. పాటకూ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అయితే చరణ్ మాట విని వీడియో కూడా విడుదల చేసి ఉంటే ఆ పాటలోని సాహిత్యానికి సుక్కు వీడియో మిక్స్ అయితే .. అబ్బో ఊహించడానికే ఓ రేంజ్ లో ఉంది కదూ..

More Related Stories