English   

ఇన్స్టా లో చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా

Ram Charan
2021-06-22 15:26:01

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో సరికొత్త మైల్ స్టోన్ కు చేరుకున్నారు. రామ్ చరణ్ ఫాలోవర్స్ సంఖ్య ఇన్స్టా లో 4 మిలియన్లకు చేరుకుంది. అంతేకాకుండా రామ్ చరణ్ కు ట్విట్టర్ లో 1.3  మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. మరోవైపు ఫేస్ బుక్ లో రామ్ చరణ్ ఫాలోవర్స్ సంఖ్య 5.4 మిలియన్ గా ఉంది. దీంతో టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన హీరోల లిస్టులో రామ్ చరణ్ కూడా ఉన్నారు. 

ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. కాగా రామ్ చరణ్ సోమవారం ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అంతే కాకుండా చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇది ఇలా ఉండగా చరణ్ తమిళ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య ఆర్ఆర్ఆర్ షూటింగ్ లు పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారు.

More Related Stories