English   

రామ్ చరణ్ మహేష్ బాబు తోపులు

Ram Charan Mahesh Babu
2018-07-29 20:25:24

సూపర్ హిట్ సినిమాల గురించి ఎంత మాట్లాడుకుంటారో.. సూపర్ హిట్ సాంగ్స్ గురించి కూడా అంతే మాట్లాడుకుంటారు ఆడియన్స్. ఈ విషయంలో ఎవరు టాపో, ఎవరు తోపో కూడా నిర్ణయించేది వారే. అయితే కొన్ని రికార్డులు కొత్తగా ఉంటాయి. పాత రికార్డులు అన్న మేటర్ పక్కన బెడితే ఇవి కొత్త రికార్డులే కాదు.. సరికొత్త రికార్డులకూ కొలమానాలు. అంటే ఈ విషయంలో వీటిదే ఫస్ట్ వరుస. అందుకే ఈ రికార్డులు కొత్తగా వస్తోన్న ఎన్నో విషయాలకు పోటీగా నిలుస్తాయి. ఇంతకీ మనం ఏ రికార్డుల గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా.. తెలుగులో అత్యధికంగా విన్నలేదా చూసిన పాటల గురించి. యస్.. ఈ విషయంలో రామ్ చరణ్, సమంత తర్వాతే ఎవరైనా.. అని ఓ కొత్త రికార్డ్ ప్రూవ్ చేస్తోంది. అఫ్ కోర్స్ ఈ రికార్డ్ వాటాలో దర్శకుడు సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ లకూ ప్లేస్ ఉంటుందనుకోండి.

ఇక అసలు విషయం ఏంటంటే.. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత తెలుగులో అత్యధికంగా చూసిన పాట ఏంటీ అనే ఓ సర్వే జరిగింది. దీనికి సర్వే కూడా అవసరం లేదనుకోండి. యూ ట్యూబ్ వ్యూస్ చూస్తే తెలిసిపోతుంది కదా.. ఆ లెక్కలో రంగస్థలంలోని రంగమ్మా మంగమ్మా పాట టాప్ లో ఉంది. ఈ పాటకు అత్యధికంగా 80మిలియన్ వ్యూస్ రావడం విశేషం. రంగమ్మా మంగమ్మా తర్వాతి పాట ఏంటో ఊహించగలరా.. ఇది అనూహ్యంగా ఛలో సినిమాలోని పాటకు రెండో స్తానం దక్కింది. చూసీ చూడంగానే నచ్చేశావె అంటూ చాలా రోజులుగా ఈ పాట ఎంతోమంది రింగ్ టోన్ గా కాలర్ టోన్ గా మారిపోయింది. అందుకే ఈ పాటకు అంత వ్యూస్ వచ్చాయి. మహతి సాగర్ సంగీతం అందించిన ఛలో మూవీలోని ఈ పాటకు రికార్డ్ స్థాయిలో 66మిలియన్ వ్యూస్ ఉన్నాయి.

ఇక థర్డ్ ప్లేస్ లో మళ్లీ రంగస్థలం నుంచే ఉండటం విశేషం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించి రంగస్థలం ఆల్బమ్ అంతా దుమ్మురేపింది. మోస్ట్ వ్యూడ్ సాంగ్స్ లో ఫస్ట్ ప్లేస్ తో పాటు థర్డ్ ప్లేస్ రంగస్థలానికే దక్కింది. జిల్ జిల్ జిగేల్ రాణి అంటూ అన్ని వయసుల వారిని ఊపేసిన ఈ పాట 35మిలియన్ వ్యూస్ తో మూడో స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనేనేను లోని వచ్చాడయ్యో సామి సాంగ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు కూడా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వచ్చాడయ్యో సామీ 21మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానంలో నిలిచింది.

ఇక నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలోని దారి చూడుదుమ్మూ చూడు మామ మోస్ట్ వ్యూస్ లిస్ట్ లోనూ దుమ్మురేపింది. మహేష్ తో సమానంగా నాని పాట కూడా 21 మిలియన్ వ్యూస్ తెచ్చుకుని రికార్డ్స్ సృష్టించింది. మొత్తంగా రాబోయే రోజుల్లో ఈ మోస్ట్ వ్యూడ్ సాంగ్ అనేది కూడా ఓ కొత్త రికార్డ్ గా మారుతుంది. అంటే తర్వాతి రోజుల్లో వచ్చే పాట ఏదైనా రంగమ్మా మంగమ్మాను దాటే వరకూ ఈ రికార్డ్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

More Related Stories