English   

అయ్యోపాపం.. చ‌ర‌ణ్ ఒంటరైపోయాడే..? 

Ram Charan-market
2018-03-24 16:14:04

అవునా.. ఎందులో ఒంట‌రి.. ఫ్యాన్స్ ఉన్నారు.. ఫ్యామిలీ ఉంది.. కావాల్సినంత స‌పోర్ట్ ఉంది.. పైగా వ‌ర‌స‌గా సినిమాలు ఉన్నాయి.. ఇంకా ఎందులో చ‌ర‌ణ్ ఒంట‌రి అయ్యాడు అనుకుంటున్నారా..? ఒక్క విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్ ఒంట‌రి. తెలుగులో 50.. 60.. 70 కోట్ల ట్రెండ్ కు తెర తీసింది రామ్ చ‌ర‌ణ్. ఈయ‌న న‌టించిన మ‌గ‌ధీర తొమ్మిదేళ్ల కిందే 70 కోట్ల మార్క్ అందుకుంది. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ రికార్డుల‌న్నిటినీ తునా తున‌క‌లు చేసాడు చ‌ర‌ణ్. కానీ ఆ సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఆ రేంజ్ స‌క్సెస్ రాలేదు. అంతెందుకు మ‌గ‌ధీర త‌ర్వాత మ‌రో 50 కోట్ల సినిమా కోసం ఏకంగా ఏడేళ్లు ఆగాడు చ‌ర‌ణ్. ధృవ‌తో అది సాధించాడు. కానీ ఈయ‌న కంటే త‌క్కువ ఇమేజ్ ఉంది అనుకున్న హీరోలంతా ఇప్పుడు 70..80..90 కోట్లు కూడా సాధిస్తున్నారు. అంతెందుకు అల్లుఅర్జున్ నే తీసుకోండి.. ఈయ‌న మార్కెట్ ఇప్పుడు 70 కోట్లు. టాప్ గ్రేడ్ లో ఉంటూ 50 కోట్ల‌లోనే ఆగి పోయిన ఏకైక హీరో రామ్ చ‌ర‌ణ్. అదే ఇప్పుడు చ‌ర‌ణ్ లో ఉన్న బాధ‌. అందుకే రంగ‌స్థలంతో 70 కోట్ల మార్క్ అందుకుని.. తాను కూడా టాప్ గ్రేడ్ హీరోనే అని నిరూపించుకోడానికి చూస్తున్నాడు మెగా వార‌సుడు. ఈ చిత్రం త‌ర్వాత ఎలాగూ బోయ‌పాటి.. రాజ‌మౌళి.. కొర‌టాల సినిమాలున్నాయి కాబ‌ట్టి చ‌ర‌ణ్ కు తిరుగుండ‌దు. అవి కానీ హిట్టైతే మ‌నోడి మార్కెట్ 70 ఏం ఖ‌ర్మ‌.. 100 కోట్ల‌కు చేరిపోవ‌డం ఖాయం. 
 

More Related Stories