చరణ్ గెటప్.. సెటప్ మారిపోయిందిగా..

రామ్ చరణ్.. ఈ హీరోను తలుచుకోగానే గడ్డంతో ఉన్న మొహమే కనిపిస్తుంది. ఏడాది నుంచి ఇదే రూపంలో ఉన్నాడు చరణ్. రంగస్థలం కోసం ఈ రూపంలోకి మారిపోయాడు మెగా వారసుడు. సుకుమార్ కూడా తనకు కావాల్సిన లుక్ కోసం చరణ్ ను చాలా అంటే చాలా కష్టపెట్టాడు. దాదాపు 15 లుక్స్ తర్వాత దీన్ని ఓకే చేసాడు సుకుమార్. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ అయిపోయింది. దాంతో మళ్లీ నార్మల్ లుక్ లోకి వచ్చేసాడు చరణ్. మొన్నే అమెరికాకు వెళ్లినపుడు కూడా గడ్డంతోనే ఉన్నాడు ఈ హీరో. ఎక్కడ మళ్లీ సుకుమార్ రీ షూట్ అంటాడేమో.. అప్పటికప్పుడు గడ్డం రాదు కదా అని పూర్తిగా సుకుమార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు ఆగాడు రామ్ చరణ్. వచ్చిన తర్వాతే గడ్డంపై బ్లేడ్ వేటు పడింది. ఇప్పుడు మళ్లీ క్లీన్ షేవ్ తో పదేళ్ల కింద రామ్ చరణ్ ఎలా ఉండేవాడో ఆ రూపంలోకి మారిపోయాడు.
తనకెరీర్ మొదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రంగస్థలం ఫ్యాన్స్ కు తాను ఇస్తున్న బహుమతి అని చెప్పాడు రామ్ చరణ్. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఏ సినిమాను కూడా చూడండంటూ ప్రేక్షకులను కోరలేదని.. ఆ అవసరం కూడా రాలేదని చెప్పాడు చరణ్. కానీ రంగస్థలం మాత్రం ఓ సారి చూడండంటూ చెప్పాడు ఈ హీరో. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందనే భావిస్తున్నట్లు చెప్పాడు రామ్ చరణ్. తాజాగా ఈయన ఓ ఈవెంట్ కు వచ్చాడు. అక్కడే రంగస్థలం గురించి.. తన కొత్త లుక్ గురించి చెప్పాడు చరణ్. ఇప్పుడు ఈయన బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఈ ఏడాదే పూర్తికానుంది. దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది. మొత్తానికి ఏడాదిన్నర తర్వాత కొత్తగా పాత లుక్ లో కనిపించాడు రామ్ చరణ్.