English   

శంకర్ తో సినిమా తర్వాత చరణ్ మరో సినిమా..

Ram Charan
2021-04-08 16:09:35

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌలి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ మరియు వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉండగానే చరణ్ కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో దాదాపు చరణ్ 30 నిమిషాలపాటు కనిపించనున్నారు. 

ఇక ఈ చిత్రంలో చరణ్ తన షూటింగ్ పార్ట్ ను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం మేలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇవి ఇలా ఉండగానే చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తిచేసుకున్న అనంతరం జులై లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పూర్తయ్యాక చరణ్ మళ్లీ రావా, జెర్సీ చిత్రాల దర్శకుడు గౌతమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారట. ఇప్పటికే గౌతమ్ చరణ్ కు కథ వినిపించగా చెర్రీ కి బాగా నచ్చిందట. ఇక ఈ సినిమాపై పూర్తి క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.

More Related Stories