English   

టాలీవుడ్ ముగ్గురు మొన‌గాళ్లు..

Ram Charan NTR Mahesh Special Celebrate Vamshi Paidipally Birthday

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఎక్క‌డ విన్నా వీళ్ల గురించే చ‌ర్చ జ‌రుగుతుంది. ఎక్క‌డ చూసినా.. ఎక్కడికి వెళ్లినా క‌లిసి పండ‌గ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే చేసారు. వాళ్లే మహేష్.. చ‌ర‌ణ్.. ఎన్టీఆర్. ఇదివ‌ర‌కు కూడా అంతా క‌లిసే ఉండేవారు కానీ సాక్ష్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్నీ క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్నాయి. మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం చేస్తారు అన్న‌ట్లు అంతా క‌లిసి మెలిసి క‌నిపిస్తున్నారు. హీరోలే కాదు.. వాళ్ల భార్య‌లు కూడా క‌లిసుందాం రా అంటూ పాడుకుంటున్నారు. అన్నీ హ్యాపీగా సాగిపోతున్నాయి ఇలా. ఇప్పుడు మ‌ళ్లీ వంశీ పైడిప‌ల్లి పుట్టిన‌రోజు వేడుక‌లో చ‌ర‌ణ్.. మహేష్.. ఎన్టీఆర్ క‌లిసారు. ఈ ముగ్గురితోనూ వంశీకి అనుబంధం ఉంది.

ఎన్టీఆర్ బృందావ‌నంతోనే ఈయ‌న ద‌ర్శ‌కుడిగా తొలి విజ‌యం అందుకున్నాడు.. చ‌ర‌ణ్ తో ఎవ‌డు చేసాడు.. ఇప్పుడు మహేష్ 25వ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. దాంతో ఈ ముగ్గురు ఈయ‌న బ‌ర్త్ డే పార్టీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. ఈ మ‌ధ్య వీళ్లే కాదు.. వీళ్ల కుటుంబాలు కూడా రెగ్యుల‌ర్ గా క‌లుసుకుంటూనే ఉన్నారు. మొన్న‌టికి మొన్న ఎన్టీఆర్ కొడుకు.. మహేష్ కూతురు పుట్టిన‌రోజుల‌కు ప్ర‌త్యేక‌మైన గిఫ్టులు కూడా పంపించాడు చ‌ర‌ణ్. ఇలా అంతా క‌లిసిమెలిసి క‌నిపిస్తూ ఫ్యాన్స్ కు కూడా కొత్త ఎన‌ర్జీని పాస్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఇదే అర్థం చేసుకుని ఫాలో అయితే టాలీవుడ్ లో ఫ్యాన్ వార్ అనేది మ‌రిచిపోవ‌చ్చు.

More Related Stories