English   

చ‌ర‌ణ్-ఎన్టీఆర్.. ఛ‌లో అమెరికా.. 

Ram-Charan-NTR
2018-03-07 13:18:32

రామ్ చ‌ర‌ణ్-ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ మాత్ర‌మే రాలేదు కానీ ఈ చిత్రానికి సంబంధించిన ప‌నుల‌న్నీ వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఓ ట్రిప్ కూడా వెళ్లారు. అయితే ఇది జాలీ ట్రిప్ కాదు. ఇటు చ‌ర‌ణ్.. అటు ఎన్టీఆర్ కోసం అమెరికాలో వ‌ర్క్ షాప్ ఒక‌టి ఏర్పాటు చేసాడు రాజ‌మౌళి. అక్క‌డే ప‌ది రోజుల పాటు ఉండ‌బోతున్నారు ఈ ఇద్ద‌రు హీరోలు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఈ స్టార్స్ ఇద్ద‌రూ బ్యాగుల‌తో ద‌ర్శ‌న‌మిచ్చారు. మార్చ్ 7 నుంచి ప‌ది రోజుల పాటు అమెరికాలోనే ఉండ‌బోతున్నారు చ‌ర‌ణ్, ఎన్టీఆర్. వీళ్లిద్ద‌రిపై ఓ ఫోటోషూట్ కూడా అక్క‌డే ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. వ‌చ్చిన త‌ర్వాత బోయ‌పాటి సినిమాతో చ‌ర‌ణ్.. త్రివిక్ర‌మ్ సినిమాతో ఎన్టీఆర్ బిజీ కానున్నారు. ఈ రెండు సినిమాలు ద‌స‌రా వ‌ర‌కు పూర్తి కానున్నాయి. ఈ మేర‌కు ఇప్ప‌టికే చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌కు రాజ‌మౌళి నుంచి స్వీట్ అండ్ సాఫ్ట్ వార్నింగ్ కూడా వెళ్లింది. అక్టోబ‌ర్ లోపు మీ సినిమాలు పూర్తి చేసుకుని రావాల‌ని ఇప్ప‌టికే చెప్పేసాడు జ‌క్క‌న్న‌. దీన్నిబ‌ట్టే త‌మ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్. మొత్తానికి వ‌ర్క్ షాప్ మొద‌లైంది.. ఇక అక్టోబ‌ర్ నుంచి అస‌లు వ‌ర్క్ కూడా మొద‌లు కానుంద‌న్న‌మాట‌.

More Related Stories