English   

చ‌ర‌ణ్-కొర‌టాల‌.. ఇదెక్క‌డో విన్న‌ట్లుందే..!

Ram-Charan
2018-03-17 09:35:47

మిర్చి సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్-కొర‌టాల సినిమా ఓపెన్ అయింది. బండ్ల‌గ‌ణేష్ నిర్మాత‌గా ఈ చిత్రానికి కొబ్బ‌రికాయ్ కూడా కొట్టారు. కానీ ఏదో జ‌రిగింది సీన్ లోప‌ల‌. ఆ స్క్రీన్ ప్లేలో లాక్ ఏంటో అర్థం కాలేదు కానీ క‌థ‌లో ఎక్క‌డో తేడా కొట్టి ఈ సినిమా ప‌ట్టాలెక్క‌క ముందే అట‌కెక్కేసింది. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సినిమా గురించి ఇటు చ‌ర‌ణ్ కానీ.. అటు కొర‌టాల కానీ నోరు విప్ప‌లేదు. ఆ త‌ర్వాత కొర‌టాల శ్రీ‌మంతుడు చేసి ఇండ‌స్ట్రీ హిట్ తో త‌న స‌త్తా చూపించాడు. జ‌న‌తా గ్యారేజ్ తో హ్యాట్రిక్ పూర్తి చేసాడు. ఇప్పుడు ఈయ‌న భ‌ర‌త్ అనే నేను సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే భ‌ర‌త్ అనే నేను మొద‌లైన‌పుడే చ‌ర‌ణ్ తో కూడా సినిమా ఉంటుంద‌ని అనౌన్స్ చేసాడు కొర‌టాల‌.

ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. కొణిదెల, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయ‌ని తెలిపాడు చ‌రణ్. ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చి కూడా మ‌ళ్లీ ఆర్నెళ్ల‌కు పైగానే అయింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంపై మ‌ళ్లీ ఎవ‌రూ మాట్లాడ్డం లేదు. ఈ విష‌యాన్ని ఇటు చ‌ర‌ణ్.. అటు కొర‌టాల ఇద్ద‌రూ మ‌రిచిపోయారు. ఇప్పుడు రాంచ‌ర‌ణ్ మ‌రో రెండేళ్ల వ‌ర‌కు బిజీ. కొర‌టాల కూడా ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లంతో బిజీగా ఉన్నాడు. త‌ర్వాత బోయ‌పాటి సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. అక్టోబ‌ర్ నుంచి రాజ‌మౌళితో బిజీ. ఇలా మ‌రో ఏడాదిన్న‌ర వ‌ర‌కు చ‌ర‌ణ్ అస్స‌లు దొర‌క‌డు. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు కొర‌టాల అయితే ఈయ‌న కోసం వేచి చూడ‌డుగా..! అంటే రెండోసారి కూడా ఈ కాంబినేష‌న్ బిస్కెట్ అవుతుంద‌నేగా దీన‌ర్థం.

More Related Stories