English   

రామ్ చరణ్ ప్రూవ్ చేసుకున్నట్టేనా..

Ram-Charan

మెగాపవర్ స్టార్ గా బిరుదు ఉన్నా ఆ రేంజ్ యాక్టింగ్ టాలెంట్ చూపించడంలో రామ్ చరణ్ ఇప్పటి వరకూ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అయితే రంగస్థలం చూసిన ఎవరైనా ఇకపై అలాంటి కమెంట్స్ చేసే అవకాశం లేదు. ఆ రేంజ్ నటనతో ఆశ్చర్యపరిచాడు చరణ్. చిట్టిబాబు పాత్రను ఆవాహన చేసుకున్నాడా అన్నట్టుగా.. ఎక్కడా ఆ పాత్రకు సంబంధించిన మీటర్ తగ్గకుండా అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడు. ఈ సినిమా తర్వాత చరణ్ ను చాలామంది చిరంజీవితో పోలుస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. చిట్టిబాబు పాత్ర కోసం అతనెంత కష్టపడ్డాడో. ఇక నుంచి అతనికి నటన రాదు అనడానికి ఏ ఆస్కారం లేదు. ఆరంభం నుంచీ ఆఖరు వరకూ చరణ్ ఎక్స్ ప్రెషన్స్ తో చంపేశాడు. ముఖ్యంగా ఆది పినిశెట్టిని కాపాడే ఫైట్ లో సీన్ లో కానీ, అతని దహనసంస్కారాలు జరుగుతున్నప్పుడు కొడవలితో కొడుతూ కామ్ గా ఉండే సీన్ కానీ, ది బెస్ట్ అనుకోవచ్చు. ఇక క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ తో పలికే సంభాషణలు ఎక్స్ ప్రెషన్స్ అతనెంత మెచర్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో తెలియజేస్తుంది. అలాగే ఆ తర్వాత సమంతను కలిసి ‘పద’అని పలికే సీన్ అద్భుతమే అనుకోవచ్చు.  మొత్తంగా రామ్ చరణ్ నటుడుగా ప్రూవ్ చేసుకున్న మొదటి సినిమా ఇదే అంటే అతిశయోక్తేం కాదు. ఇప్పటి వరకూ రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో విసిగించిన మెగా హీరో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఓ పాత్రగా మారి సినిమాను భుజాలపై మోశాడు. సినిమా గురించి కంటే ఇప్పుడు రామ్ చరణ్ నటన గురించే ఎక్కువమంది డిస్కస్ చేసుకుంటున్నారంటే తెలుసుకోవచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత చరణ్ టాలెంట్ ను ఇంతవరకూ దర్శకులు వాడుకోలేదా.. లేక అతనే బయటకు తీయలేదా అనేమానం ఖచ్చితంగా వస్తుంది. 

More Related Stories