English   

రామ్ చరణ్ పై ‘ఓవర్’ వెయిట్..?

ram-charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంపై ఓవర్ వెయిట్ పడబోతోంది. అది తట్టుకునే శక్తి రామ్ చరణ్ కు ఉందా అనేదే పెద్ద ప్రశ్న. ఇంతకీ ఆ ఓవర్ వెయిట్ ఏంటో తెలుసా..? ఓవర్ సీస్.. యస్ ఓవర్శీస్ మార్కెట్ లో రామ్ చరణ్ చాలా పూర్. అతని సినిమాల్లో కొంత వరకూ బెటర్ గా మార్కెట్ చేసిన సినిమా ధృవ మాత్రమే. కానీ ఇప్పుడు రంగస్థలంను అక్కడ అమ్మిన రేట్ కు అక్కడ అతని మార్కెట్ కు చాలా వ్యత్యాసం ఉంది. ఇదే చరణ్ పై పెద్ద బర్డెన్ కాబోతోంది. రంగస్థలం సినిమాను ఓవర్శీస్ లో దాదాపు 9కోట్లకు అమ్మారు. ఇప్పటి వరకూ సినిమాకు వస్తోన్న పాజిటివ్ బజ్, దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ ఇవన్నీ కూడా ఈ రేట్ రావడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే దీన్ని రికవర్ చేయాల్సిన బాధ్యత చరణ్ ది. అదే అతనికి ఓవర్ వెయిట్ గా మారిందిప్పుడు. 

రంగస్థలం వల్ల ఓవర్శీస్ బయ్యర్స్ నష్టపోకూడదంటే కనీసం అతను 2.5మిలియన్ వసూలు చేయాలి. కానీ చరణ్ కు అంత మార్కెట్ లేదు. మెగాస్టార్ 150వ సినిమాకు కూడా అంత రాలేదు. ఇక చరణ్ కు వస్తాయా అనేది డౌట్. సినిమాకు భీబత్సమైన టాక్ వచ్చినా అంత వసూలు చేయడం కష్టమే. చేస్తే మాత్రం ఆశ్చర్యమనే చెప్పాలి. ఒకవేళ చరణ్ ఈ ఫీట్ సాధిస్తే ఖచ్చితంగా అతనికి పెద్ద రిలీఫ్ వస్తుంది. ఇప్పటి వరకూ చాలామంది స్టార్స్ ఒన్ మిలియన్ క్లబ్ లో ఉన్నారు. వారితో కంపేర్ చేస్తే చరణ్ కు ఆ మార్కెట్ లేదు. ఇప్పుడీ మూవీతో కనీసం రెండు మిలియన్స్ వసూలు చేసినా ఖచ్చితంగా అతని రేంజ్ పెరిగినట్టే. అయితే అప్పుడు అది సుకుమార్ వల్లే అని చెప్పేవారూ ఉంటారు.. సో ఎలా చూసినా ఓవర్శీస్ లో బయ్యర్స్ ను సేఫ్ జోన్ లో పడేయడం చరణ్ కు అంత సులభం కాదు. 

More Related Stories