English   

చిట్టిబాబు గట్టిగా కొట్టాడుగా..

Charan-Rangasthalam

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... ఇన్నాళ్లూ తన పేరుకు ముందు అంత పెద్ద బిరుదు ఉంటే చరణ్ ఎలా ఫీలయ్యాడోకానీ.. ఇకపై ఏ ఫీలింగ్ లేకుండా దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. మరి ఇంత వరకూ పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ చూపించలేదంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో రంగస్థలంతో నిరూపించుకున్నాడు. అయితే ఈ విజయాన్ని అందరికంటే ఎక్కువగా చిరంజీవి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. తానెంతో కష్టపడి ఈ పొజిషన్ కు వచ్చాడు. ఆ పొజిషన్ ను ఏ కష్టం లేకుండానే తనయుడికి, వారసులకూ ఇచ్చాడు. ఈ విషయంలో వారేదైనా రాంగ్ స్టెప్ వేసినా.. మంచి కథ సెలెక్ట్ చేసుకోకపోయినా.. సరిగా నటించకపోయినా అదంతా తనకే కలిగిన బాధగా ఫీలయ్యాడు. ఈ విషయంలో నిన్నటి వరకూ నటన పరంగా రామ్ చరణ్ కు చిరంజీవికి తగ్గ వారసుడు కాదు అన్నవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ రంగస్థలం చూసిన ఎవరైనా ఇకపై అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేరు. నటన పరంగానే కాదు.. మార్కెట్ పరంగా చిట్టిబాబు గట్టి దెబ్బే వేశాడు.. 

తొలిరోజు కలెక్షన్లలో దాదాపు 29కోట్లకు పైన వసూలు చేశాడు. 19కోట్ల షేర్ ఉంది అందులో. ఇక ఓవర్శీస్ లో కూడా ఫస్ట్ డేనే ఒన్ మిలియన్ క్లబ్ ను దాటేశాడు. ఈ స్పీడ్, అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూస్తే అతను టూ మిలియన్ క్లబ్ లో జాయిన్ అవడానికి రెండు రోజుల కంటే ఎక్కువ పట్టేలా లేదు. ఇక లాంగ్ రన్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకూ చరణ్ కెరీర్ లో ఒన్ మిలియన్ క్లబ్ లో చేరిన సినిమా ధృవ మాత్రమే. తర్వాత ఒకేసారి టూ మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ కాబోతుండటం విశేషమే. అయితే ఓవర్శీస్ వరకూ కేవలం రామ్ చరణ్ పొటెన్షియల్ అని చెప్పలేం. సుకుమార్ సినిమాలకు అక్కడ మంచి గిరాకీ ఉంది. అలాగే మైత్రీ మూవీస్ కు ఓవర్శీస్ లో చాలా కెపాసిటీ ఉంది. ఇవి ఓపెనింగ్స్ వరకూ సహకరించినా.. రామ్ చరణ్ నటన, సినిమా బావుంది అనే టాక్ బోనస్ గా యాడ్ అవడంతో చిట్టిబాబు ఓవర్శీస్ లోగట్టిగానే కొట్టినట్టైంది. 

More Related Stories