English   

రంగస్థలం వదిలిన చిట్టిబాబు

ram charan -rangasthalam
2018-03-05 19:45:10

చిట్టిబాబు రంగస్థలం వదిలాడు. రంగస్థలంలో పాటు చాలాకాలంగా పెంచుతోన్న గడ్డం కూడా తీయించుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా రూపొందుతోన్న రంగస్థలం షూటింగ్ పూర్తిగా అయిపోయింది. కొన్నాళ్ల క్రితమే షూట్ ముగిసినా ప్యాచ్ వర్క్ కోసం చరణ్ అదే లుక్ ను మెయిన్టేన్ చేశాడు. సినిమా అవుట్ పుట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. సుకుమార్ డైరెక్షన్ లో ప్రేక్షకుల్ని 1985ల కాలం నాటికి తీసుకువెళ్లే ప్రయత్నం మాత్రం స్ట్రాంగ్ గా జరిగినట్టు ఇప్పటికే అర్థమైంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ మూవీలోని రెండు పాటలకూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న రంగస్థలంలో ఎవరూ ఊహించినన్ని స్పెషాలిటీస్ ఉన్నాయంటున్నారు.

ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లుకున్న కథనీ, తన సోదరిపై అఘాయిత్యం చేసిన వారిపై పగ తీర్చుకునే కథ అనే కథలు వినిపిస్తున్నాయి. కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా నటిస్తున్నాడు. అలాగే సమంత పాత్ర మూగది. ఈ ఇద్దరి కాంబినేషనే హైలెట్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి వీరి మధ్య వచ్చే సన్నవేశాలన్నీ హిలేరియస్ గా ఉంటూనే హార్ట్ టచింగ్ గానూ అనిపిస్తాయంటున్నారు. ఏదేమైనా ఇక రంగస్థలం ప్రొడక్షన్ వర్క్ పూర్తయిపోయింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. త్వరలోనే మరో పాట విడుదల చేయబోతున్నారు. ఆల్బమ్ లో ఇదే హైలెట్ సాంగ్ అవుతుంది అని ఆ మధ్యే చెప్పారు. ఓ ఐటమ్ సాంగ్ ను పూజా హెగ్డే చేయడం విశేషం. మొత్తంగా అనుకున్నట్టుగానే రంగస్థలం ఈ నెల 29నే థియేటర్స్ లోకి రాబోతోంది.

ఈ సినిమాకు సంబంధించిన చరణ్ పని కూడా పూర్తయినట్టే. దీంతో పూర్తి స్థాయిలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాపై కాన్ సెంట్రేట్ చేస్తాడు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి కొన్నాళ్లు యూరప్ ట్రిప్ కు వెళ్లబోతున్నారు. అక్కడ వీరు చేయబోయే మల్టీస్టారర్ కు సంబంధించి పూర్తి స్థాయి డిస్కషన్స్ చేస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాను, రామ్ చరణ్ బోయపాటి మూవీని పూర్తి చేసి రాజమౌళికి డేట్స్ ఇచ్చేస్తారు.. 

More Related Stories