English   

రంగ‌స్థ‌లం ప్రీమియ‌ర్స్.. ఫ్యాన్స్ కు టెన్ష‌న్.. 

Rangasthalam-premiers
2018-03-24 17:44:04

ప్రీమియ‌ర్స్ వేస్తున్నారంటే ఫ్యాన్స్ ఖుషీ అవ్వాలి కానీ ఎందుకు ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారా..? ఇది చ‌ర‌ణ్ కంటే కూడా అభిమానుల‌కే ఎక్కువ‌గా తెలుసు. స‌రిగ్గా మూడేళ్ల కింద రామ్ చ‌ర‌ణ్ న‌టించిన బ్రూస్లీ సినిమాకు ముందు రోజు రాత్రే భారీగా ప్రీమియ‌ర్స్ వేసారు. చిరంజీవి రీ ఎంట్రీ కావ‌డంతో ర‌చ్చ రంబోలా చేసారు. కానీ ఫ‌లితం మాత్రం దారుణంగా వ‌చ్చింది. విడుద‌ల రోజు మార్నింగ్ షోకు సినిమా డిజాస్ట‌ర్ అని తేల్చారు. నిజానికి సినిమా యావ‌రేజ్ గానే ఉన్నా.. బ‌య‌ట టాక్ మాత్రం దారుణం అని వెళ్లింది. దాంతో బ్రూస్లీకి కోలుకోలేని దెబ్బ ప‌డింది. అది మొద‌లు మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు ప్రీమియ‌ర్స్ అనే మాటంటేనే చ‌ర‌ణ్.. అత‌డి ఫ్యాన్స్ కు భ‌యం. కానీ ఇప్పుడు మ‌ళ్లీ రంగ‌స్థ‌లంకు ఇదే చేయ‌బోతున్నారు. ఈ చిత్రం మార్చ్ 30న విడుద‌ల కానుంది. దానికంటే ఒక్క‌రోజు ముందు.. అంటే మార్చ్ 29 రాత్రి నుంచే భారీగా ప్రీమియ‌ర్స్ వేయ‌బోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగ‌స్థ‌లం ర‌చ్చ మొద‌లు కానుంది. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై చాలా న‌మ్మ‌కంగా క‌నిపిస్తున్నాడు మెగా వార‌సుడు. దాంతో రంగ‌స్థ‌లం ప్రీమియ‌ర్స్ షోస్ వేస్తామ‌ని చెప్పిన‌పుడు కూడా ఓకే అనేసాడు. ఈ సినిమా క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అని ముందు నుంచే ఫిక్స్ అయిపోయాడు ఈ హీరో. అందుకే ప్రీమియ‌ర్స్ వేసినా లాభ‌మే త‌ప్ప న‌ష్టం ఉండ‌దంటున్నాడు. పైగా సుకుమార్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఓవ‌ర్సీస్ లో కూడా సినిమా కుమ్మేయ‌డం ఖాయం. మొత్తానికి చూడాలిక‌.. బ్రూస్లీ చేదు జ్ఞాప‌కాల‌ను రంగ‌స్థ‌లం మ‌రిపిస్తుందో లేదో..? 
 

More Related Stories