English   

సిద్ధమవుతున్న ఆచార్య

Acharya
2021-03-01 18:16:24

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరు కు జంటగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని కొరటాల శివ గతంలోనే వెల్లడించాడు. అంతే కాకుండా సినిమాలో చరణ్ పాత్ర కేవలం గెస్ట్ రోల్ కాదని ఒక 30 నిమిషాల పాటు కీలక పాత్రలో నటిస్తున్నాడని స్పష్టం చేసాడు.  అయితే తాజాగా సినిమా నుండి కొరటాల మరో పోస్టర్ ను విడుదల చేశాడు. ఆ ఫొటోలో చరణ్ తుపాకి వైపు చూస్తుండగా...చరణ్ చేతిపై ఎర్ర జండా కట్టుకున్న ఓ వ్యక్తి చరణ్ ను అదుపు చేసే భుజం పై చేయి వేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ ఫ్యాన్స్ ఫోటోను చూసి ముచ్చట పడుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యువ్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాను మే 14 న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

More Related Stories